శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల డిగ్రీ మరియు ఇంటర్ తెలుగు విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో 30-7- 2026 వ తేదీన సాహితీ సదస్సు అత్యంత ఘనంగా నిర్వహింపబడినది.
ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా డాక్టర్ మేడసాని మోహన్ గారు విచ్చేశారు.( తిరుమల తిరుపతి దేవస్థానముల అన్నమాచార్యుల ప్రాజెక్టు డైరెక్టర్ )
మాట్లాడుతూ మహాభారతంలో స్త్రీ పాత్రలు అనే )అంశంపై జరిగిన తెలుగు సాహితీ సదస్సుకు అధ్యక్షులైన జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్. పద్మజ గారు మాట్లాడుతూ అన్నమాచార్య సంకీర్తనలోని గంభీర భావాలను, ఆధ్యాత్మికతను, విద్యార్థులు అలవర్చుకోవాలని తెలియజేశారు. తదుపరి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్
డాక్టర్ .పి.వి .దుర్గావతి గారు మహాభారత పఠనం ద్వారా విద్యార్థులకు స్నేహం విలువ, ధర్మం, అర్థం ,కామమోక్షాల ప్రాసత్యం ఇవన్నీ ధర్మపద్ధంగా అలవర్చుకోవడం పలు అంశాలపై అవగాహనను పెంపొందించుకోవాలని కోరారు.
ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథి డాక్టర్ మేడసాని మోహన్ గారు ప్రవచిస్తూ మహాభారతంలో స్త్రీ పాత్రలు కేవలం ఇల్లాలుగా మాత్రమే కాకుండా ధర్మం కుటుంబం మరియు సమాజ గతిని మార్చే శక్తివంతమైన నాయకుడిగా మార్గదర్శకులుగా గొప్ప ప్రాధాన్యతను సంతరించుకున్నాయని తెలిపారు. అవమానాలను ఎదుర్కొని పాండవులను నిరంతరం యుద్ధం వైపు ధర్మం వైపు నడిపించిన ప్రతీక ద్రౌపది అని ఆత్మస్థైర్యానికి ధర్మ నిరూపణకు పరాకాష్ట ద్రౌపది అని పేర్కొన్నారు.
కష్టాలనువచ్చి తన పిల్లలను ధర్మవర్తనలుగా తీర్చిదిద్దిన బాధ్యతాయుతమైన మాతృమూర్తి అని కర్తవ్యం నిర్వహణకు పరిపాలన దక్షతకు ప్రత్యేక కుంతి అని కుంతిదేవుని కీర్తించారు.
పతివ్రత ధర్మానికి ప్రతీకగా అధర్మాన్ని నడిపిస్తూ కుమారుల తప్పిదాలను హెచ్చరించిన ధీరవనిత గాంధారి అని గుర్తు చేశారు. మహాసాద్వి సీత, సావిత్రి వేదాలలోని మైత్రేయ గారికి వీరందరినీ ఆదర్శంగా తీసుకొని ప్రతి స్త్రీ ముందుకు సాగాలని విద్యార్థులు కుటుంబ వ్యవస్థను చక్కదిద్దే మాతృమూర్తి మాట వినాలని అదే భవితకు పూలబాటని ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల తెలుగు విభాగాధిపతి డాక్టర్ కె .సరళ, జూనియర్ కళాశాల తెలుగు విభాగాధిపతి శ్రీమతి.జి హనుమాయమ్మ తెలుగు అధ్యాపకులు డాక్టర్ .ఐ. మంజుల, కాత్యాయని మరియు విద్యార్థినులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


