Friday, 18 September 2026
  • Home  
  • వృద్ధాశ్రమంలో మహమ్మద్ రజాక్ జన్మదిన వేడుకలు
- తూర్పు గోదావరి

వృద్ధాశ్రమంలో మహమ్మద్ రజాక్ జన్మదిన వేడుకలు

కేశవరం, సెప్టెంబర్ 16 (పున్నమి ప్రతినిధి): కేశవరం గ్రామానికి చెందిన చిరంజీవి మహమ్మద్ రజాక్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ సేవా సమితి ఆధ్వర్యంలో మల్లంపూడిలో ఉన్న సాయిబాబా వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వృద్ధాశ్రమంలో నివసిస్తున్న వృద్ధులకు భోజనం అందించారు. పుట్టినరోజు వేడుకలను కేవలం ఉత్సవంగా కాకుండా, వృద్ధులకు ఆప్యాయతను పంచే సేవా కార్యక్రమంగా నిర్వహించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి రజాక్ తల్లిదండ్రులు మహమ్మద్ బషీర్, మహమ్మద్ రేష్మా, తాతయ్య–నానమ్మ మహమ్మద్ జహంగీర్, మహమ్మద్ విజయవాడ, అమ్మమ్మ–తాతయ్య షేక్ చానా, షేక్ సాయిదా, కుటుంబ సభ్యులు సహకరించారు. ఈ సందర్భంగా మహమ్మద్ రజాక్‌కు సేవా సమితి సభ్యులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవిస్తూ మరిన్ని సేవా కార్యక్రమాలకు స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు. “మానవసేవే మాధవసేవ” అనే భావనతో నిర్వహించిన ఈ కార్యక్రమం వృద్ధులలో ఆనందాన్ని నింపింది.

కేశవరం, సెప్టెంబర్ 16 (పున్నమి ప్రతినిధి): కేశవరం గ్రామానికి చెందిన చిరంజీవి మహమ్మద్ రజాక్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ సేవా సమితి ఆధ్వర్యంలో మల్లంపూడిలో ఉన్న సాయిబాబా వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వృద్ధాశ్రమంలో నివసిస్తున్న వృద్ధులకు భోజనం అందించారు.

పుట్టినరోజు వేడుకలను కేవలం ఉత్సవంగా కాకుండా, వృద్ధులకు ఆప్యాయతను పంచే సేవా కార్యక్రమంగా నిర్వహించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి రజాక్ తల్లిదండ్రులు మహమ్మద్ బషీర్, మహమ్మద్ రేష్మా, తాతయ్య–నానమ్మ మహమ్మద్ జహంగీర్, మహమ్మద్ విజయవాడ, అమ్మమ్మ–తాతయ్య షేక్ చానా, షేక్ సాయిదా, కుటుంబ సభ్యులు సహకరించారు.

ఈ సందర్భంగా మహమ్మద్ రజాక్‌కు సేవా సమితి సభ్యులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవిస్తూ మరిన్ని సేవా కార్యక్రమాలకు స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు. “మానవసేవే మాధవసేవ” అనే భావనతో నిర్వహించిన ఈ కార్యక్రమం వృద్ధులలో ఆనందాన్ని నింపింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.