నెల్లూరు జిల్లా రాపూరు పట్టణంలో బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళను మోటారు బైక్ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందింది. మృతురాలిని భూపతి శ్రీదేవి (53)గా పోలీసులు గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బైక్ నడుపుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు, ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది. ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది.

బైక్ ఢీకొని మహిళ మృతి