ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా సోమవారం రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్య కళాశాల ఆధ్వర్యంలో ప్రత్యేక విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎం.ఎస్. రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
పబ్లిక్ హెల్త్ డేస్ నోడల్ ఆఫీసర్ డా. బి. శ్రీనివాస్ నాయక్ ప్రొఫెసర్ కమ్యూనిటీ మెడిసిన్ మాట్లాడుతూ జంతువుల నుండి మనుషులకు సంక్రమించే వ్యాధుల (జూనోసిస్) నివారణ, నియంత్రణ చర్యలపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి అన్నారు .
వ్యక్తిగత పరిశుభ్రత, పర్యావరణ పరిశుభ్రత, వన్ హెల్త్ విధానం, జంతు సంక్షేమం, టీకాల ప్రాముఖ్యత, కాటు అనంతర రక్షణ చికిత్స వంటి అంశాలపై అవగాహన కల్పించారు.డా. కె. శివప్రసాద్ వైస్ ప్రిన్సిపాల్ మాట్లాడుతూ వ్యక్తిగత పరిశుభ్రత తో బాటు పెంపుడు జంతు ఆరోగ్యంపై పరిశుభ్రత అవసరమని వివరించారు.కమ్యూనిటీ మెడిసిన్ హెచ్ ఓ డి డా వి వి దుర్గ ప్రసాద్ మాట్లాడుతూ
జునోసిస్ వ్యాధులు నివారణే ముఖ్యం కాబట్టి వీటిపై అత్యంత ప్రచారం చేసి ప్రజలకు అవగాహన కల్పించాలని విద్యార్ధులకు సూచించారు. కళాశాల
ప్రిన్సిపాల్ డా ఎమ్మెస్ రాజు మాట్లాడుతూ జూనోసిస్ డే సందర్భంగా ప్రతిఒక్కరూ తమ తమ పెంపుడు జంతువుల ఆరోగ్య పరిరక్షణలో జాగ్రత్త వహించాలని, పెంపుడు జంతువుల వల్ల మానసిక ఆరోగ్యం పెంపొందుతుందని, అదేవిధముగా జంతువులనుంచి వ్యాప్తిచేందే వ్యాధులపట్ల జాగ్రత్తలు తీసుకోవాలని వివరించారు. జంతుప్రేమికులకు జూనోసిస్ వ్యాధులపట్ల అవగాహన కలిగించి వ్యాధుల వ్యాప్తిని అరికట్టాలని విద్యార్థులకు హితవు పలికారు.
అనంతరం కళాశాలలో మూడవ సంవత్సరం ఎంబీబీఎస్ విద్యార్థులు జూనోసిస్ వ్యాధులపై గోడపత్రిక రూపొందించి, వాటి వ్యాప్తి, లక్షణాలు, నివారణ చర్యలను వివరిస్తూ ప్రదర్శించారు.
తదుపరి ప్రిన్సిపాల్ డా. ఎం.ఎస్. రాజు పచ్చజెండా ఊపి అవగాహన ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీలో విద్యార్థులు ఈ ఏడాది ప్రపంచ జూనోసిస్ దినోత్సవ థీమ్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా నినాదాలు చేస్తూ అవగాహన కల్పించారు.కార్యక్రమం ముగింపులో విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది కలిసి మానవహారం ఏర్పాటు చేసి,ప్రతిజ్ఞ చేసి జూనోటిక్ వ్యాధుల నివారణకు తమ మద్దతు ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల అధిపతులు,అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, కళాశాల సిబ్బంది మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

ప్రభుత్వ వైద్య కళాశాల ఆధ్వర్యంలో ప్రపంచ జునోసిస్ దినోత్సవం
ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా సోమవారం రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్య కళాశాల ఆధ్వర్యంలో ప్రత్యేక విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎం.ఎస్. రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పబ్లిక్ హెల్త్ డేస్ నోడల్ ఆఫీసర్ డా. బి. శ్రీనివాస్ నాయక్ ప్రొఫెసర్ కమ్యూనిటీ మెడిసిన్ మాట్లాడుతూ జంతువుల నుండి మనుషులకు సంక్రమించే వ్యాధుల (జూనోసిస్) నివారణ, నియంత్రణ చర్యలపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి అన్నారు . వ్యక్తిగత పరిశుభ్రత, పర్యావరణ పరిశుభ్రత, వన్ హెల్త్ విధానం, జంతు సంక్షేమం, టీకాల ప్రాముఖ్యత, కాటు అనంతర రక్షణ చికిత్స వంటి అంశాలపై అవగాహన కల్పించారు.డా. కె. శివప్రసాద్ వైస్ ప్రిన్సిపాల్ మాట్లాడుతూ వ్యక్తిగత పరిశుభ్రత తో బాటు పెంపుడు జంతు ఆరోగ్యంపై పరిశుభ్రత అవసరమని వివరించారు.కమ్యూనిటీ మెడిసిన్ హెచ్ ఓ డి డా వి వి దుర్గ ప్రసాద్ మాట్లాడుతూ జునోసిస్ వ్యాధులు నివారణే ముఖ్యం కాబట్టి వీటిపై అత్యంత ప్రచారం చేసి ప్రజలకు అవగాహన కల్పించాలని విద్యార్ధులకు సూచించారు. కళాశాల ప్రిన్సిపాల్ డా ఎమ్మెస్ రాజు మాట్లాడుతూ జూనోసిస్ డే సందర్భంగా ప్రతిఒక్కరూ తమ తమ పెంపుడు జంతువుల ఆరోగ్య పరిరక్షణలో జాగ్రత్త వహించాలని, పెంపుడు జంతువుల వల్ల మానసిక ఆరోగ్యం పెంపొందుతుందని, అదేవిధముగా జంతువులనుంచి వ్యాప్తిచేందే వ్యాధులపట్ల జాగ్రత్తలు తీసుకోవాలని వివరించారు. జంతుప్రేమికులకు జూనోసిస్ వ్యాధులపట్ల అవగాహన కలిగించి వ్యాధుల వ్యాప్తిని అరికట్టాలని విద్యార్థులకు హితవు పలికారు. అనంతరం కళాశాలలో మూడవ సంవత్సరం ఎంబీబీఎస్ విద్యార్థులు జూనోసిస్ వ్యాధులపై గోడపత్రిక రూపొందించి, వాటి వ్యాప్తి, లక్షణాలు, నివారణ చర్యలను వివరిస్తూ ప్రదర్శించారు. తదుపరి ప్రిన్సిపాల్ డా. ఎం.ఎస్. రాజు పచ్చజెండా ఊపి అవగాహన ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీలో విద్యార్థులు ఈ ఏడాది ప్రపంచ జూనోసిస్ దినోత్సవ థీమ్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా నినాదాలు చేస్తూ అవగాహన కల్పించారు.కార్యక్రమం ముగింపులో విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది కలిసి మానవహారం ఏర్పాటు చేసి,ప్రతిజ్ఞ చేసి జూనోటిక్ వ్యాధుల నివారణకు తమ మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల అధిపతులు,అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, కళాశాల సిబ్బంది మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

