కేశవరం, సెప్టెంబర్ 16 (పున్నమి ప్రతినిధి): కేశవరం గ్రామానికి చెందిన చిరంజీవి మహమ్మద్ రజాక్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ సేవా సమితి ఆధ్వర్యంలో మల్లంపూడిలో ఉన్న సాయిబాబా వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వృద్ధాశ్రమంలో నివసిస్తున్న వృద్ధులకు భోజనం అందించారు.
పుట్టినరోజు వేడుకలను కేవలం ఉత్సవంగా కాకుండా, వృద్ధులకు ఆప్యాయతను పంచే సేవా కార్యక్రమంగా నిర్వహించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి రజాక్ తల్లిదండ్రులు మహమ్మద్ బషీర్, మహమ్మద్ రేష్మా, తాతయ్య–నానమ్మ మహమ్మద్ జహంగీర్, మహమ్మద్ విజయవాడ, అమ్మమ్మ–తాతయ్య షేక్ చానా, షేక్ సాయిదా, కుటుంబ సభ్యులు సహకరించారు.
ఈ సందర్భంగా మహమ్మద్ రజాక్‌కు సేవా సమితి సభ్యులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవిస్తూ మరిన్ని సేవా కార్యక్రమాలకు స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు. “మానవసేవే మాధవసేవ” అనే భావనతో నిర్వహించిన ఈ కార్యక్రమం వృద్ధులలో ఆనందాన్ని నింపింది.




