Sunday, 20 September 2026
  • Home  
  • స్థానిక ఎన్నికలకు కాంగ్రెస్ శ్రేణులు సమరసన్నద్ధం కావాలి
- అనకాపల్లి

స్థానిక ఎన్నికలకు కాంగ్రెస్ శ్రేణులు సమరసన్నద్ధం కావాలి

ఎలమంచిలి, సెప్టెంబర్ 15, పున్నమి ప్రతినిధి ఆనంద్: రాబోయే స్థానిక ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పూర్తి స్థాయిలో సిద్ధం కావాలని యలమంచిలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ తనకాల అనంతరావు పిలుపునిచ్చారు. యలమంచిలి పట్టణంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల్లో అసంతృప్తి నెలకొందని విమర్శించారు. నిత్యావసర ధరల పెరుగుదల, మంచినీటి సమస్య, విద్యుత్ కోతలు, గ్రామాల్లో బెల్ట్‌షాపులు, గంజాయి కార్యకలాపాలు ఆందోళనకరంగా ఉన్నాయని అన్నారు. ప్రజా సమస్యలపై కాంగ్రెస్ శ్రేణులు ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. ఈ నెల 17న యలమంచిలిలో జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. డీసీసీ అధ్యక్షులు బొడ్డూ శ్రీనివాస్, డీసీసీ ఉపాధ్యక్షులు రావి రామసత్యం, నాగు మంత్రి సాయి, సుందరపు ఈశ్వరరావు, మేరుగు అచ్చిబాబు, కంకణాలు నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సమావేశానికి టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు దొడ్డి రవి అధ్యక్షత వహించారు.

ఎలమంచిలి, సెప్టెంబర్ 15, పున్నమి ప్రతినిధి ఆనంద్:
రాబోయే స్థానిక ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పూర్తి స్థాయిలో సిద్ధం కావాలని యలమంచిలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ తనకాల అనంతరావు పిలుపునిచ్చారు. యలమంచిలి పట్టణంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల్లో అసంతృప్తి నెలకొందని విమర్శించారు. నిత్యావసర ధరల పెరుగుదల, మంచినీటి సమస్య, విద్యుత్ కోతలు, గ్రామాల్లో బెల్ట్‌షాపులు, గంజాయి కార్యకలాపాలు ఆందోళనకరంగా ఉన్నాయని అన్నారు. ప్రజా సమస్యలపై కాంగ్రెస్ శ్రేణులు ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. ఈ నెల 17న యలమంచిలిలో జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. డీసీసీ అధ్యక్షులు బొడ్డూ శ్రీనివాస్, డీసీసీ ఉపాధ్యక్షులు రావి రామసత్యం, నాగు మంత్రి సాయి, సుందరపు ఈశ్వరరావు, మేరుగు అచ్చిబాబు, కంకణాలు నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సమావేశానికి టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు దొడ్డి రవి అధ్యక్షత వహించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.