స్టేషన్ ఘనపూర్, జూలై 20:
స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ పరిధిలోని శివునిపల్లి గ్రామానికి చెందిన బీఎస్పీ కార్యకర్త కొడిశాల లక్ష్మణ్ అన్న కొడిశాల రామ్ గత సంవత్సరం మృతి చెందగా, నిన్న ఆయన ప్రథమ సంవత్సరికం కార్యక్రమం నిర్వహించారు.
ఈ సంతాప కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా అధ్యక్షులు జలగం ప్రవీణ్ గారు పాల్గొని, రామ్ చిత్రపటానికి పూలమాల నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కుటుంబానికి పార్టీ తరఫున ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా కల్పించి మనోధైర్యం చెప్పారు. ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని, పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో బీఎస్పీ స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు గుర్రం కుమారస్వామి, నియోజకవర్గ కార్యదర్శి మునిగల వెంకన్న, నాయకులు సన్నీ, చిన్న తదితరులు పాల్గొని నివాళులర్పించారు.

స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో బీఎస్పీ నేతల పరామర్శ
స్టేషన్ ఘనపూర్, జూలై 20: స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ పరిధిలోని శివునిపల్లి గ్రామానికి చెందిన బీఎస్పీ కార్యకర్త కొడిశాల లక్ష్మణ్ అన్న కొడిశాల రామ్ గత సంవత్సరం మృతి చెందగా, నిన్న ఆయన ప్రథమ సంవత్సరికం కార్యక్రమం నిర్వహించారు. ఈ సంతాప కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా అధ్యక్షులు జలగం ప్రవీణ్ గారు పాల్గొని, రామ్ చిత్రపటానికి పూలమాల నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కుటుంబానికి పార్టీ తరఫున ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా కల్పించి మనోధైర్యం చెప్పారు. ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని, పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు గుర్రం కుమారస్వామి, నియోజకవర్గ కార్యదర్శి మునిగల వెంకన్న, నాయకులు సన్నీ, చిన్న తదితరులు పాల్గొని నివాళులర్పించారు.

