Tuesday, 15 September 2026
  • Home  
  • సెప్టెంబర్‌ 29న పాఠశాలల SMC ఎన్నికలు.. షెడ్యూల్‌ విడుదల
- అనకాపల్లి

సెప్టెంబర్‌ 29న పాఠశాలల SMC ఎన్నికలు.. షెడ్యూల్‌ విడుదల

అనకాపల్లి జిల్లా, సెప్టెంబర్‌ 15 – పున్నమి న్యూస్‌ రిపోర్టర్‌ ఆనంద్‌: ప్రభుత్వ పాఠశాలల్లో స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ (SMC)ల పునర్‌వ్యవస్థీకరణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు SMC ఎన్నికల షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. సెప్టెంబర్‌ 15న ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేయగా, సెప్టెంబర్‌ 18న మధ్యాహ్నం 2 గంటలకు ఓటర్ల జాబితాను పాఠశాలల్లో ప్రదర్శించనున్నారు. సెప్టెంబర్‌ 25న ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు స్వీకరించి, అదే రోజు మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు తుది జాబితా ప్రకటించనున్నారు. సెప్టెంబర్‌ 29న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు SMC ఎన్నికలు నిర్వహించనున్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. ఎన్నికల ప్రక్రియను పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అధికారులు పర్యవేక్షించనున్నారు.

అనకాపల్లి జిల్లా, సెప్టెంబర్‌ 15 – పున్నమి న్యూస్‌ రిపోర్టర్‌ ఆనంద్‌:

ప్రభుత్వ పాఠశాలల్లో స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ (SMC)ల పునర్‌వ్యవస్థీకరణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు SMC ఎన్నికల షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. సెప్టెంబర్‌ 15న ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేయగా, సెప్టెంబర్‌ 18న మధ్యాహ్నం 2 గంటలకు ఓటర్ల జాబితాను పాఠశాలల్లో ప్రదర్శించనున్నారు. సెప్టెంబర్‌ 25న ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు స్వీకరించి, అదే రోజు మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు తుది జాబితా ప్రకటించనున్నారు. సెప్టెంబర్‌ 29న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు SMC ఎన్నికలు నిర్వహించనున్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. ఎన్నికల ప్రక్రియను పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అధికారులు పర్యవేక్షించనున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.