Sunday, 23 August 2026
  • Home  
  • సెప్టెంబర్ 12న జరిగే లోక్ అదాలత్ పై బ్యాంకు అధికారులు మరియు న్యాయవాదులతో సమీక్షా సమావేశం
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సెప్టెంబర్ 12న జరిగే లోక్ అదాలత్ పై బ్యాంకు అధికారులు మరియు న్యాయవాదులతో సమీక్షా సమావేశం

పల్నాడు జిల్లా సత్తెనపల్లి: సెప్టెంబర్ 12వ తేదీన నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేసేందుకు సత్తెనపల్లి సబ్ డివిజన్ పరిధిలోని బ్యాంక్ అధికారులు న్యాయవాదులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సత్తెనపల్లి మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో లోక్ అదాలత్ ద్వారా వీలైనంత ఎక్కువ సంఖ్యలో కేసులు రాజీ అయ్యేలా చర్యలుతీసుకోవాలని న్యాయమూర్తులు… బ్యాంకు అధికారులకు న్యాయవాదులకు సూచించారు. *సత్తెనపల్లి మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, సత్తెనపల్లి సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) వి. విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ…* లోక్ అదాలత్ లతో రాజీకి అవకాశం ఉన్న సివిల్ తగాదాలు, బ్యాంకు రుణాలకు సంబంధించిన వివాదాలు,రాజీపడదగిన క్రిమినల్ కేసులు,మనోవర్తి కేసులు, చెక్ బౌన్స్ కేసులు, రెవెన్యూ వివాదాల కేసులను ముందుగానే గుర్తించి, ఇరు వర్గాలతో సమన్వయం చేసుకుని పరిష్కారం అయ్యేలా కృషి చేయాలని కోరారు. ఇటువంటి కేసుల పరిష్కారంతో కక్షిదారులకు సమయం, డబ్బు ఆదా కావడంతో పాటు, దీర్ఘకాలంగా కొనసాగుతున్న వివాదాలకు త్వరితగతిన పరిష్కారం లభిస్తుందని తెలిపారు. ముఖ్యంగా ఇరు వర్గాలు పరస్పర అంగీకారంతో పరిష్కరించుకునే కేసులను గుర్తించి, లోక్ అదాలత్ కు తీసుకురావడంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఈ సమావేశంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి దౌసిద్దీన్, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి ప్రియదర్శిని, రెండవ అదనపు సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) సుజన్ కుమార్ తో పాటు సత్తెనపల్లి సబ్ డివిజన్ పరిధిలోని బ్యాంకు అధికారులు,న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

పల్నాడు జిల్లా సత్తెనపల్లి: సెప్టెంబర్ 12వ తేదీన నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేసేందుకు సత్తెనపల్లి సబ్ డివిజన్ పరిధిలోని బ్యాంక్ అధికారులు న్యాయవాదులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

సత్తెనపల్లి మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో లోక్ అదాలత్ ద్వారా వీలైనంత ఎక్కువ సంఖ్యలో కేసులు రాజీ అయ్యేలా చర్యలుతీసుకోవాలని న్యాయమూర్తులు… బ్యాంకు అధికారులకు న్యాయవాదులకు
సూచించారు.

*సత్తెనపల్లి మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, సత్తెనపల్లి సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) వి. విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ…* లోక్ అదాలత్ లతో రాజీకి అవకాశం ఉన్న సివిల్ తగాదాలు, బ్యాంకు రుణాలకు సంబంధించిన వివాదాలు,రాజీపడదగిన క్రిమినల్ కేసులు,మనోవర్తి కేసులు, చెక్ బౌన్స్ కేసులు, రెవెన్యూ వివాదాల కేసులను ముందుగానే గుర్తించి, ఇరు వర్గాలతో సమన్వయం చేసుకుని పరిష్కారం అయ్యేలా కృషి చేయాలని కోరారు.

ఇటువంటి కేసుల పరిష్కారంతో కక్షిదారులకు సమయం, డబ్బు ఆదా కావడంతో పాటు, దీర్ఘకాలంగా కొనసాగుతున్న వివాదాలకు త్వరితగతిన పరిష్కారం లభిస్తుందని తెలిపారు. ముఖ్యంగా ఇరు వర్గాలు పరస్పర అంగీకారంతో పరిష్కరించుకునే కేసులను గుర్తించి, లోక్ అదాలత్ కు తీసుకురావడంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

ఈ సమావేశంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి దౌసిద్దీన్, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి ప్రియదర్శిని, రెండవ అదనపు సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) సుజన్ కుమార్ తో పాటు సత్తెనపల్లి సబ్ డివిజన్ పరిధిలోని బ్యాంకు అధికారులు,న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.