నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ శుక్రవారం స్థానిక 39, 46, 47, 51 డివిజన్ల పరిధిలోని సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
సచివాలయంలోని అటెండెన్స్, మూమెంట్ రిజిస్టర్, ఆన్లైన్ అటెండెన్స్ పలు రికార్డులను తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా సచివాలయ కార్యదర్శులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి కార్యదర్శి ఎంక్వయిరీ లేదా ఫీల్డ్ విజిట్ రెండు సందర్భాలలో మూమెంట్ రిజిస్టర్ లో తప్పకుండా వివరాలను నమోదు చేయాలని సూచించారు.
నిర్దేశించిన సమయంలో అటెండెన్స్ నమోదు చేసుకోవాలని, క్రమం తప్పకుండా ఫీల్డ్ విజిట్ నిర్వహించాలని సూచించారు. సచివాలయం పనివేళలలో ప్రజలకు కార్యదర్శులు అందరూ అందుబాటులో ఉండాలని సూచించారు.
సచివాలయం పరిధిలోని పి.జి.ఆర్.ఎస్ విజ్ఞప్తులకు శాశ్వత పరిష్కారం అందించేలా కృషి చేయాలని, అదేవిధంగా ఎట్ టు వ్యూ అంశాలను పరిశీలించుకుని తదనగుణంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి రోజు మూడు గంటల నుండి నాలుగు గంటల వరకు గ్రీవెన్స్ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు.


