ఉదయగిరి పట్టణంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇంచార్జ్ షేక్ రియాజ్ అన్నగారైన షేక్ ఫయాజ్ అనారోగ్యంతో కొంతకాలంగా బాధపడుతూ ఈరోజు కన్నుమూశారు. విషయం తెలుసుకున్న వెంటనే ఉదయగిరి ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ స్థానిక నాయకులతో కలిసి ఫయాజ్ నివాసానికి చేరుకుని పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ క్లిష్ట సమయంలో మనోధైర్యంతో ఉండాలని సూచిస్తూ ప్రగాఢ సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఫయాజ్‌కు ఘనంగా నివాళులర్పించారు.

షేక్ ఫయాజ్ మృతిపై ఎమ్మెల్యే కాకర్ల సురేష్ నివాళి