*ఉభయదారులుగా నేతాజీ నగర్ వాసులు చంద్రశేఖర్ రెడ్డి,సుమతి దంపతులు*
పున్నమి ప్రతినిధి, తిరుచానూరు
తిరుచానూరు నేతాజీ నగర్ లో వెలసి ఉన్న శ్రీవిజయ గణపతి స్వామి వారికి గురువారం సాయంత్రం సంకష్టహర చతుర్ధి అభిషేక పూజలు వేడుకగా జరిగాయి.ఆలయ ధర్మకర్త పుష్ప రెడ్డి ఆహ్వానం మేరకు స్తానిక నేతాజీ నగర్ వాసులు చంద్రశేఖర్ రెడ్డి,సుమతి దంపతులు ఉభయదారులుగా వ్యవహరిస్తూ కుటుంబ సభ్యులతో కలిసి పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మధు సుధాన శర్మ శ్రీ విజయ గణపతి స్వామి వారికి పాలు పెరుగు తేనె నెయ్యి పన్నీరు విభూది చందన తదితర సుగంధ ద్రవ్యాలతో అభిషేక పూజలు వేడుకగా నిర్వహించారు.అనంతరం సంకష్టహర చతుర్ధి విశేషాన్ని వివరిస్తూ గోత్ర నామాలతో అర్చన చేసి తీర్థ ప్రసాదాలు అందజేసి,వేద ఆశీర్వాదం చేశారు.ఈ కార్యక్రమంలో స్తానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.





