శ్రీ కాళహస్తి, జూన్ 04, (పున్నమి న్యూస్) : తిరుపతి జిల్లాలోని గిరిజనుల సమస్యలను తక్షణమే పరిష్కరించి, వారి అభివృద్ధికి తగిన చర్యలు చేపట్టాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, రాష్ట్ర గిరిజన సలహా మండలి సభ్యులు మాసారపు సుబ్బయ్య అధికారులను కోరారు. తిరుపతి కలెక్టరేట్‌లో గురువారం ఆయన జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి జిల్లాలోని గిరిజనుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా గిరిజన విద్యార్థుల ఉన్నత విద్య, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, గిరిజన గురుకుల పాఠశాలల్లో మౌలిక వసతులను మరింత మెరుగుపరచాలని కోరారు. అదేవిధంగా గ్రామాల్లో, పట్టణాల్లో నివసిస్తున్న గిరిజన కుటుంబాల సమస్యలను త్వరితగతిన పరిష్కరించి వారికి ప్రభుత్వ సాయం అందించాలన్నారు. గిరిజన చిన్నారుల పౌష్టికాహారం, సంరక్షణ కోసం ప్రతి గిరిజన కాలనీలో మినీ అంగన్‌వాడీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు వినతి చేయగా దీనిపై స్పందించిన కలెక్టర్ సమస్యల పరిష్కారానికి సానుకూలంగాస్పందించారని సుబ్బయ్య తెలిపారు.

గిరిజనుల సమస్యలను పరిష్కరించాలి-కలెక్టర్‌కు సుబ్బయ్య విజ్ఞప్తి