*శ్రీనివాస కళ్యాణం ఏర్పాట్లను పరిశీలించనున్న మంత్రి మండిపల్లి*
*ఈనెల 27న శ్రీవారి కల్యాణోత్సవం రోజు మంత్రివర్యుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం*
చిన్నమండెం, ఆగస్టు 23:
అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం కొత్తపల్లి గ్రామంలోని శ్రీశ్రీశ్రీ మల్లూరమ్మ ఆలయ ప్రాంగణంలో ఈ నెల 27న నిర్వహించనున్న శ్రీనివాస కళ్యాణ మహోత్సవ ఏర్పాట్లను రాష్ట్ర రవాణా, యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నేడు సాయంత్రం 05:30 గం.లకు పరిశీలించనున్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలోని శ్రీనివాస కళ్యాణం ప్రాజెక్టులో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నెల 27న గురువారం ఉదయం 6 గంటలకు శ్రీనివాస కళ్యాణం నిర్వహించనున్నారు.
కళ్యాణోత్సవానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరుకానున్న నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చేపట్టిన ఏర్పాట్లను మంత్రి పరిశీలించనున్నారు. భక్తులకు అన్నప్రసాదం, తాగునీరు, ఇతర మౌలిక వసతుల కల్పనపై సంబంధిత నిర్వాహకులు, అధికారులతో మంత్రి సమీక్షించనున్నారు.
కళ్యాణం రోజున సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు ప్రత్యేక కార్యక్రమాలు, సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు అన్నమాచార్య కీర్తనలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా సుమారు 10 వేల మంది భక్తులకు భోజన సదుపాయం కల్పించనున్నారు.
విశాఖపట్నం నుంచి తిరుపతికి చేరుకోనున్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, తిరుపతి విమానాశ్రయం నుంచి నేరుగా కార్యక్రమ ప్రాంగణానికి చేరుకుని ఏర్పాట్లను పరిశీలించనున్నారు.
కావున పై కార్యక్రమంలో మండలంలోని కూటమి ముఖ్య నాయకులు, కార్యకర్తలు, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, అలాగే *ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు* పాల్గొని విజయవంతం చేయవలసిందిగా మనవి.
*// ఇట్లు //*
*మంత్రివర్యుల క్యాంపు కార్యాలయం, రాయచోటి*

