కడప 3వ డివిజన్లో ముమ్మరంగా ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమం
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రెడ్డెప్పగారి మాధవి – టీడీపీ జోనల్ కో-ఆర్డినేటర్ రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు
కడప, పున్నమి ప్రతినిధి:
కడప నగరంలోని 3వ డివిజన్ శ్రీరామ్‌నగర్ (సబ్-జైలు) ప్రాంతంలో ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమాన్ని ముమ్మరంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, కడప శాసనసభ్యురాలు శ్రీమతి రెడ్డెప్పగారి మాధవి గారు, టీడీపీ జోనల్ కో-ఆర్డినేటర్ శ్రీ రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి గారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిసి, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం గత రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, పారదర్శక పాలనా విధానాన్ని ప్రజలకు వివరించారు.
అలాగే స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని భరోసా కల్పించారు. నగర సమగ్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


