Monday, 22 June 2026
  • Home  
  • శ్రీకాళహస్తిలో ముగిసిన ఉమ్మడి చిత్తూరు జిల్లా అండర్-19 బాల్ బ్యాడ్మింటన్ టోర్నీ
- తిరుపతి

శ్రీకాళహస్తిలో ముగిసిన ఉమ్మడి చిత్తూరు జిల్లా అండర్-19 బాల్ బ్యాడ్మింటన్ టోర్నీ

శ్రీ కాళహస్తి, జూన్ 21, (పున్నమి న్యూస్) : శ్రీకాళహస్తి పట్టణంలోని ఆర్పీబీఎస్ జెడ్పీ బాయ్స్ హైస్కూల్ మైదానంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా స్థాయి అండర్-19 మండలాల ఇన్విటేషన్ బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఆదివారం ఘనంగా ముగిసింది. స్థానిక సీనియర్ క్రీడాకారులు, బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శని, ఆదివారాల్లో ఈ పోటీలను నిర్వహించారు. ఈ టోర్నమెంట్‌లో శ్రీకాళహస్తి, తొట్టంబేడు, కేవీబీ పురం, నగరి, బీఎన్ కండ్రిగ, వెదురుకుప్పం మండలాల క్రీడాకారులు ఉత్సాహంగా తలపడ్డారు. ఈ ముగింపు కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ ముఖ్య అతిథిగా విచ్చేసి క్రీడాకారులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాల్ బ్యాడ్మింటన్ క్రీడాభివృద్ధికి ఇలాంటి టోర్నమెంట్లను ప్రతి నెలా నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామీణ ప్రాంత క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికితీయడానికి ఇవి దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో క్రీడా ప్రముఖులు, నిర్వాహకులు నాగమల్లి మునికృష్ణ, వన్నేటి చంద్ర, గోపి, చెంచురత్నం, సుబ్బు, సాలాపక్షి నరేష్, జంగం గంగాధరం, పురుషోత్తం, సుధాకర్, రవి, యువరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.