Sunday, 24 May 2026
  • Home  
  • శ్రీకాళహస్తిలో గుర్తుతెలియని వృద్ధుడి మృతదేహం కలకలం
- తిరుపతి

శ్రీకాళహస్తిలో గుర్తుతెలియని వృద్ధుడి మృతదేహం కలకలం

శ్రీ కాళహస్తి, మే 24, (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి పట్టణంలోని విజయ రైతు డిపో షాపింగ్ కాంప్లెక్స్ మెట్లపై సుమారు 65 సంవత్సరాల వయస్సు గల గుర్తుతెలియని వృద్ధుడి మృతదేహం లభ్యమైనట్లు శ్రీకాళహస్తి టూటౌన్ పోలీస్ స్టేషన్ పోలీసులు తెలిపారు. షాపింగ్ కాంప్లెక్స్ మెట్లపై ఓ వ్యక్తి మృతిచెందిన స్థితిలో ఉండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. మృతుడు గోధుమ రంగుపై నలుపు గీతలు ఉన్న ఫుల్ హ్యాండ్స్ షర్ట్, నలుపు రంగు డ్రాయర్ ధరించి ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. మృతుడి వద్ద ఎలాంటి గుర్తింపు పత్రాలు లభించలేదని తెలిపారు. మృతుడిని ఎవరైనా గుర్తుపడితే లేదా అతనికి సంబంధించిన వివరాలు తెలిసిన వారు వెంటనే 9440900008, 9154141887 నెంబర్లలో సంప్రదించి శ్రీకాళహస్తి టూటౌన్ పోలీస్ స్టేషన్ అధికారులకు సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.