వేముల మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్స్ ఆత్మీయ సమావేశం
రాష్ట్రవ్యాప్తంగా నేడు ప్రభుత్వం నిర్వహించిన మెగా పేరెంట్స్ ఆత్మీయ సమావేశం కార్యక్రమంలో భాగంగా వేముల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సమావేశానికి టీడీపీ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు పేర్ల పార్థసారథి రెడ్డి గారి సోదరుడు, టీడీపీ సీనియర్ నాయకుడు పేర్ల శేషారెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన విద్యార్థుల తల్లిదండ్రులతో ఆత్మీయంగా మాట్లాడుతూ, పిల్లల విద్యాభివృద్ధిలో తల్లిదండ్రుల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. అలాగే, మండలంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన, పరిశుభ్రమైన, పోషకాహారం అందించేందుకు ప్రభుత్వం స్మార్ట్ కిచెన్ ద్వారా మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నట్లు తల్లిదండ్రులకు వివరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా సంక్షేమ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.





