ఈరోజు వెంకటగిరిలోని NJR భవనం నందు వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త గౌ.శ్రీ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారిని గూడూరు నియోజకవర్గ వైసీపీ నాయకులు శ్రీ.యద్దల నరేంద్ర రెడ్డి గారు మరియు గూడూరు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త శ్రీ. బూదూరు గురవయ్య గారు కలవడం జరిగింది.. ఈ సంధర్భంగా గూడూరు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా నియమించేందుకు సహకరించిన శ్రీ.నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది…..ఈ సందర్భంగా రామ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ జగనన్న మాటే మాకు శిరోధార్యం అని నాకు నియోజకవర్గ సమన్వయకర్త ఎంపికలో ఎటువంటి కోపాలు బేధాభిప్రాయాలులేవు అని తెలిపారు.. 2029ఎన్నికల్లో గురవయ్య గారిని గూడూరు నియోజకవర్గంలో గెలిపించడం కోసం నావంతు కృషి చేస్తాను స్పష్టంగా తెలియజేశారు.. అలాగే గురవయ్య గారు కూడ నియోజకవర్గంలో ఉన్న ప్రతి నాయకుడిని మరియు ప్రతి కార్యకర్తలని కలుపుకొని 2029 ఎన్నికల్లో నియోజకవర్గంలో పార్టీ జెండా ఎగరవేయాలని సూచించారు.. నీకు అండగా రాష్ట్ర నాయకత్వం మరియు జిల్లా పార్టీ నాయకత్వం పాటు నియోజకవర్గ నాయకత్వం ఉంటుంది తెలిపారు VINODKUMAR

Vinod kumar

