వెలిగొండ ప్రాజెక్టుకు ఎద్దుల విజయసాగర్ స్వాగతం..
వెలిగొండ ప్రాజెక్టు తొలి దశ ప్రారంభోత్సవాన్ని రాజంపేట అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎద్దుల విజయసాగర్ స్వాగతించారు. ప్రాజెక్టుతో 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు, 4 లక్షల మందికి తాగునీరు అందనున్నాయని తెలిపారు. ప్రాజెక్టు కోసం భూములు త్యాగం చేసిన నిర్వాసితులకు ధన్యవాదాలు తెలిపారు. వెలిగొండ సాకారానికి కృషి చేసిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నిమ్మల రామానాయుడు, అధికారులు, ప్రజాప్రతినిధులకు అభినందనలు తెలిపారు.


