*విద్యాసంస్థల్లో రాజకీయాలకు తావులేదు తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం!*పాఠశాలలు, కళాశాలలు అనేవి విద్యార్థుల బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దే దేవాలయాలు లాంటివని, అక్కడ రాజకీయాలకు ఎలాంటి స్థానం ఉండకూడదని ఇటీవలే పులివెందులలో వైసీపీ విద్యార్థులను ర్యాలీకి తీసుకువెళ్లిన విషయం మన అందరికీ తెలిసిందే.. సరిగ్గా వారం రోజుల క్రితం పులివెందుల టీడీపీ ఇంచార్జ్ బీటెక్ రవి గారు ఇటీవల కళాశాల దగ్గరకు వెళ్లి యాజమాన్యాలతో స్పష్టం చేయడం జరిగింది. ఇదే అంశం ఇప్పుడు జాతీయ స్థాయిలోనూ ప్రాధాన్యత సంతరించుకుంది.విద్యాలయాలు కేవలం విజ్ఞానాన్ని అందించేందుకేనని, అక్కడ రాజకీయ ప్రచారాలు, రాజకీయ నాయకుల ప్రవేశం ఉండకూడదని తమిళనాడు ప్రభుత్వం కూడా తాజాగా కఠిన నిషేధం విధించింది. విద్యాసంస్థల్లో రాజకీయ జోక్యం ఉండకూడదని బీటెక్ రవి గారు చెప్పిన మాటలు ఎంత సమంజసమో ఈ నిర్ణయం నిరూపిస్తోంది.విద్యార్థులను తమ స్వార్థ రాజకీయాల కోసం రోడ్లపైకి లాగడం మానుకోవాలని, విద్యాసంస్థల పవిత్రతను కాపాడాలని వైసీపీ నాయకులు ఇప్పటికైనా తెలుసుకోవాలి. ఇకనైనా విద్యార్థుల చదువుతో రాజకీయ ఆటలు ఆడటం ఆపాలి.


