Saturday, 20 June 2026
  • Home  
  • వాయులింగేశ్వరుని దర్శించిన నందమూరి మోక్షజ్ఞ
- తిరుపతి

వాయులింగేశ్వరుని దర్శించిన నందమూరి మోక్షజ్ఞ

శ్రీ కాళహస్తి, జూన్ 20, (పున్నమి టెంపుల్ న్యూస్) : ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ శనివారం ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీకాళహస్తిని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు దేవస్థాన అధికారులు, అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మోక్షజ్ఞ ఆలయ ప్రాంగణంలో రాహు-కేతు దోష నివారణ పూజల్లో పాల్గొని శాస్త్రోక్తంగా ప్రత్యేక ఆరాధనలు నిర్వహించారు. అనంతరం శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని, జ్ఞానప్రసూనాంబ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక అర్చనలు చేశారు. పూజల అనంతరం దేవస్థాన ఈవో, పాలకమండలి సభ్యులు మోక్షజ్ఞకు స్వామివారి శేషవస్త్రాన్ని కప్పి తీర్థప్రసాదాలు అందజేసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలకమండలి సభ్యుడు వాకుచెర్ల గుర్రప్ప శెట్టి, శ్రీకాళహస్తి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ బాలు ఢిల్లీ బాబు, దేవస్థాన అధికారులు, సిబ్బంది, అభిమానులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.