గ్రాండ్ అలుమ్ని సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ 1987-88 SSC, వాణి శిశు విద్యా మందిర్,
జనగాం పట్టణం
——————————-
జనగాన్, జూన్ 29, మెట్రోదయం: గ్రాండ్ అలుమ్ని
జనగాంలోని పిఎల్‌జె కన్వెన్షన్‌లో 1987-88 బ్యాచ్‌కు చెందిన వాణి శిశు విద్యామందిర్ పూర్వ విద్యార్థులు వివిధ ప్రాంతాలలో ఉద్యోగం, వ్యాపారం తదితర వృత్తులలో స్థిరపడి నివసిస్తున్న ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలు, హైదరాబాద్, బెంగుళూరు, తిరుపతి మొదలైన వివిధ ప్రాంతాల నుండి హాజరయ్యారు. పాఠశాల పూర్వ విద్యార్థులందరూ తమ సహచర బాలబాలికలతో కలిసి తమ పూర్వ విద్యార్థి జీవిత అనుభవాన్ని పంచుకున్నారు.ఒకరినొకరు కలుసుకున్నప్పుడు తాము ఎంతో సంతోషంగా ఆనందంగా జీవిస్తన్నామంటే ఆ రోజులలో మాకు విద్యా బుద్దులు నేర్పిన గురువులే కారణమని తెలిపారు. ఈ సందర్బంగా విద్యార్థులు మాట్లాడుతూ ఉపాధ్యాలు మంచి విలువలు, నైతిక విద్య మాత్రమే కాకుండా కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పిన మాస్టారు మురళీ సార్ నుంచి ఇంగ్లిష్ బోధనలో మంచి ప్రావీణ్యం పొందారు.ఫకీర్ యాదగిరి సార్, సత్యం సర్, మోతె సురేందర్ రెడ్డి సర్,పరుశరాములు సార్ ఆప్యాయంగా, క్రమశిక్షణ తో బోధించారని పూర్వ విద్యార్థులు కోడం కుమారస్వామి,సురేందర్ రెడ్డి, పోకల వేణు తదితరులు మాట్లాడారు.
ఈ సందర్భంగా మోతె శ్రీనివాస్‌రెడ్డి, పోకల వేణు, వసుంధర, మధురవేణి, మంజుల, మధు, నాగరాజు, శ్రీనివాస్, మధు, పాము మోహన్ మాట్లాడుతూ దేవుడి దయతో ఉపాధ్యాయులు వాణీశు మందిరంలో తమకు మంచి మార్గదర్శకత్వం, క్రమశిక్షణ, బోధించడం వళ్ళ మేమంతా మంచి స్థానంలో స్థిరపడ్డారని తెలిపారు.ఈ సందర్భంగా ఫకీర్ యాదగిరిరెడ్డి మాట్లాడుతూ భారతీయులకు సేవ చేయాలని, విదేశాలకు వెళ్లకూడదని.. ఆయనతోపాటు ఉపాధ్యాయులు మాట్లాడుతూ భారతీయ సంస్కృతిని, సంప్రదాయాలను కాపాడాలని శ్లోకాలు పఠిస్తూ, యోగా, ధ్యానం తదితర సాధనలు చేస్తూ, తల్లిదండ్రులతో కలిసి సంతోషంగా జీవించాలని, రామాయణం, మహాభారతం తదితర గ్రంథాలను చదవడం పిల్లలకు అలవర్చాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జగదీష్, అరవింద్, విజయలక్ష్మి, అనిత తదితరులు పాల్గొన్నారు.

వాణి శిశు విద్యా మందిర్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం 1987-88 బ్యాచ్
గ్రాండ్ అలుమ్ని సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ 1987-88 SSC, వాణి శిశు విద్యా మందిర్, జనగాం పట్టణం ——————————- జనగాన్, జూన్ 29, మెట్రోదయం: గ్రాండ్ అలుమ్ని జనగాంలోని పిఎల్‌జె కన్వెన్షన్‌లో 1987-88 బ్యాచ్‌కు చెందిన వాణి శిశు విద్యామందిర్ పూర్వ విద్యార్థులు వివిధ ప్రాంతాలలో ఉద్యోగం, వ్యాపారం తదితర వృత్తులలో స్థిరపడి నివసిస్తున్న ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలు, హైదరాబాద్, బెంగుళూరు, తిరుపతి మొదలైన వివిధ ప్రాంతాల నుండి హాజరయ్యారు. పాఠశాల పూర్వ విద్యార్థులందరూ తమ సహచర బాలబాలికలతో కలిసి తమ పూర్వ విద్యార్థి జీవిత అనుభవాన్ని పంచుకున్నారు.ఒకరినొకరు కలుసుకున్నప్పుడు తాము ఎంతో సంతోషంగా ఆనందంగా జీవిస్తన్నామంటే ఆ రోజులలో మాకు విద్యా బుద్దులు నేర్పిన గురువులే కారణమని తెలిపారు. ఈ సందర్బంగా విద్యార్థులు మాట్లాడుతూ ఉపాధ్యాలు మంచి విలువలు, నైతిక విద్య మాత్రమే కాకుండా కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పిన మాస్టారు మురళీ సార్ నుంచి ఇంగ్లిష్ బోధనలో మంచి ప్రావీణ్యం పొందారు.ఫకీర్ యాదగిరి సార్, సత్యం సర్, మోతె సురేందర్ రెడ్డి సర్,పరుశరాములు సార్ ఆప్యాయంగా, క్రమశిక్షణ తో బోధించారని పూర్వ విద్యార్థులు కోడం కుమారస్వామి,సురేందర్ రెడ్డి, పోకల వేణు తదితరులు మాట్లాడారు. ఈ సందర్భంగా మోతె శ్రీనివాస్‌రెడ్డి, పోకల వేణు, వసుంధర, మధురవేణి, మంజుల, మధు, నాగరాజు, శ్రీనివాస్, మధు, పాము మోహన్ మాట్లాడుతూ దేవుడి దయతో ఉపాధ్యాయులు వాణీశు మందిరంలో తమకు మంచి మార్గదర్శకత్వం, క్రమశిక్షణ, బోధించడం వళ్ళ మేమంతా మంచి స్థానంలో స్థిరపడ్డారని తెలిపారు.ఈ సందర్భంగా ఫకీర్ యాదగిరిరెడ్డి మాట్లాడుతూ భారతీయులకు సేవ చేయాలని, విదేశాలకు వెళ్లకూడదని.. ఆయనతోపాటు ఉపాధ్యాయులు మాట్లాడుతూ భారతీయ సంస్కృతిని, సంప్రదాయాలను కాపాడాలని శ్లోకాలు పఠిస్తూ, యోగా, ధ్యానం తదితర సాధనలు చేస్తూ, తల్లిదండ్రులతో కలిసి సంతోషంగా జీవించాలని, రామాయణం, మహాభారతం తదితర గ్రంథాలను చదవడం పిల్లలకు అలవర్చాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జగదీష్, అరవింద్, విజయలక్ష్మి, అనిత తదితరులు పాల్గొన్నారు.

