Sunday, 23 August 2026
  • Home  
  • వర్షాకాల సీజనల్ వ్యాధులపై విద్యార్థులకు అవగాహన
- అనకాపల్లి

వర్షాకాల సీజనల్ వ్యాధులపై విద్యార్థులకు అవగాహన

అనకాపల్లి జిల్లా | పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ ) యలమంచిలి: వర్షాకాలంలో ప్రబలే సీజనల్ వ్యాధులపై విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచించారు. యలమంచిలి రైల్వే స్టేషన్ రోడ్డులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం సీజనల్ వ్యాధులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ ధినయ్ కుమార్, హోమియో వైద్య నిపుణులు డాక్టర్ ఎల్. రిషిత పాల్గొన్నారు. వర్షాకాలంలో వచ్చే వ్యాధులు, వాటి లక్షణాలు, నివారణ చర్యలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, దోమలు వృద్ధి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు. అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులకు ప్రివెంటివ్ మెడిసిన్ (నివారణ మందులు) పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయుడు మల్లిపాటి సత్యనారాయణ, ఉపాధ్యాయులు డి.వి. భారతి, కె. రాజేష్, పి. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

అనకాపల్లి జిల్లా | పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ )

యలమంచిలి: వర్షాకాలంలో ప్రబలే సీజనల్ వ్యాధులపై విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచించారు. యలమంచిలి రైల్వే స్టేషన్ రోడ్డులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం సీజనల్ వ్యాధులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ ధినయ్ కుమార్, హోమియో వైద్య నిపుణులు డాక్టర్ ఎల్. రిషిత పాల్గొన్నారు. వర్షాకాలంలో వచ్చే వ్యాధులు, వాటి లక్షణాలు, నివారణ చర్యలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, దోమలు వృద్ధి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు. అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులకు ప్రివెంటివ్ మెడిసిన్ (నివారణ మందులు) పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయుడు మల్లిపాటి సత్యనారాయణ, ఉపాధ్యాయులు డి.వి. భారతి, కె. రాజేష్, పి. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.