వజ్రాల వారి పెళ్లి సందడిలో పాల్గొన్న ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు.
మైలవరం నియోజకవర్గంలోని పుల్లూరు గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు వజ్రాల కుమార్‌రెడ్డి గారి కుటుంబంలో జరిగిన వివాహ వేడుకల్లో మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారు శుక్రవారం పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లిలోని సీఏ కన్వెన్షన్ హాల్‌లో వజ్రాల కుటుంబ బంధువుల వివాహ వేడుక ఘనంగా జరిగింది. శిరీష్ కుమార్‌రెడ్డి – శ్రీజ వివాహ వేడుకకు ఎమ్మెల్యే కృష్ణప్రసాదు గారు హాజరై వధూవరులను ఆశీర్వదించి, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు వజ్రాల శ్రీనివాసరెడ్డి – శ్రీమతి రత్నకుమారి, వజ్రాల కుమార్‌రెడ్డి – శ్రీమతి ఉషారాణి ఎమ్మెల్యేకృష్ణప్రసాదు గారికి క ఆత్మీయ స్వాగతం పలికారు. వివాహ వేడుకలో కుటుంబ సభ్యులు, బంధువులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.




