బ్రేక్ ఇన్‌స్పెక్టర్ పార్వతి సస్పెన్షన్.. డ్రైవర్‌పై చర్యలకు ఆదేశాలు.
విశాఖపట్నం: లారీ డ్రైవర్‌పై బ్రేక్ ఇన్‌స్పెక్టర్ కారు డ్రైవర్ దాడి చేసిన ఘటనపై రవాణాశాఖ ఉన్నతాధికారులు సీరియస్‌గా స్పందించారు. జాయింట్ కమిషనర్ శివరాం ప్రసాద్ మంగళవారం విచారణ చేపట్టి ఘటనకు సంబంధించిన వివరాలను స్వయంగా సేకరించారు.
ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయంలో ఘటనకు సంబంధించిన ఇద్దరు డ్రైవర్ల నుంచి వాంగ్మూలాలు తీసుకున్న జాయింట్ కమిషనర్.. అనంతరం ఆర్టీవో కార్యాలయంలో బ్రేక్ ఇన్‌స్పెక్టర్ పార్వతి వాంగ్మూలాన్ని నమోదు చేశారు.
ఘటనలో అధికారుల బాధ్యత, సిబ్బంది వ్యవహారశైలి, దాడికి దారితీసిన పరిస్థితులపై వివరాలు సేకరించారు.
లారీ డ్రైవర్‌పై దాడి చేయడం, విధి నిర్వహణలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది.
ఘటనకు బాధ్యులైన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని అధికారులు స్పష్టం చేశారు.
ఈ వ్యవహారంలో బ్రేక్ ఇన్‌స్పెక్టర్ పార్వతిని సస్పెండ్ చేస్తున్నట్లు జాయింట్ కమిషనర్ ప్రకటించారు. లారీ డ్రైవర్‌పై దాడికి పాల్పడిన కారు డ్రైవర్‌పై కూడా నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
“రవాణాశాఖలో దాడులకు తావులేదు.. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు”
లారీ డ్రైవర్లు, రవాణా రంగానికి చెందిన సిబ్బందితో అధికారులు గౌరవంగా వ్యవహరించాలని, అధికార దుర్వినియోగం లేదా దౌర్జన్యానికి పాల్పడితే శాఖాపరమైన చర్యలతో పాటు చట్టపరమైన చర్యలు కూడా తప్పవని అధికారులు స్పష్టం చేసినట్లు సమాచారం.
Uploaded Video:

