ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని అలీగంజ్ ప్రాంతంలో ఉన్న మూడు అంతస్తుల వాణిజ్య భవనంలో సోమవారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుని కనీసం 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. గ్రాఫిక్స్, యానిమేషన్ కోచింగ్ సెంటర్, లైబ్రరీ, పెట్ షాప్ నిర్వహిస్తున్న ఈ భవనంలో మధ్యాహ్నం మంటలు చెలరేగడంతో లోపల ఉన్నవారు బయటపడేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. కొంతమంది విద్యార్థులు ప్రాణాలు రక్షించుకునేందుకు భవనం నుంచి కిందకు దూకిన దృశ్యాలు వెలుగుచూశాయి. ఘటనపై ముగ్గురిని పోలీసులు అరెస్టు చేయగా, నలుగురు అధికారులను సస్పెండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించారు.

లక్నో భవన అగ్నిప్రమాదంలో 15 మంది మృతి.. ఎక్కువ మంది విద్యార్థులే