Wednesday, 16 September 2026
  • Home  
  • రైలు కిందకు దూకి.. ప్రయాణికుడి ప్రాణాలు కాపాడిన హెడ్ కానిస్టేబుల్
- అనకాపల్లి

రైలు కిందకు దూకి.. ప్రయాణికుడి ప్రాణాలు కాపాడిన హెడ్ కానిస్టేబుల్

తుని (అనకాపల్లి), సెప్టెంబర్ 14 – పున్నమి ప్రతినిధి ఆనంద్: రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రయాణికుడిని ప్రాణాలకు తెగించి రక్షించిన ఎలమంచిలి రూరల్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ చంద్రరావు (HC-496) మానవత్వాన్ని చాటుకున్నారు. విశాఖపట్నం నుంచి అలప్పీ వెళ్తున్న ధన్‌బాద్ ఎక్స్‌ప్రెస్ తుని రైల్వే స్టేషన్ వద్ద నెమ్మదిగా కదులుతుండగా ఓ ప్రయాణికుడు రైలు ఎక్కే క్రమంలో అదుపుతప్పి బోగీ కింద పట్టాలపై పడిపోయాడు. ప్రమాదాన్ని గమనించిన చంద్రరావు ఏమాత్రం ఆలస్యం చేయకుండా బోగీ కిందకు వెళ్లి పట్టాల మధ్య చిక్కుకున్న ప్రయాణికుడిని బయటకు తీసి ప్రాణాలు కాపాడారు. అనంతరం చికిత్స కోసం ఆసుపత్రికి తరలించేలా చర్యలు చేపట్టారు. హెడ్ కానిస్టేబుల్ చంద్రరావు సాహసాన్ని ఎలమంచిలి రూరల్ ఎస్‌ఐ ఉపేందర్ అభినందించారు. ఈ సాహసోపేత సేవలను జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఐపీఎస్ గుర్తించి నగదు రివార్డు, ప్రశంసా పత్రం అందజేశారు.

తుని (అనకాపల్లి), సెప్టెంబర్ 14 – పున్నమి ప్రతినిధి ఆనంద్:

రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రయాణికుడిని ప్రాణాలకు తెగించి రక్షించిన ఎలమంచిలి రూరల్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ చంద్రరావు (HC-496) మానవత్వాన్ని చాటుకున్నారు. విశాఖపట్నం నుంచి అలప్పీ వెళ్తున్న ధన్‌బాద్ ఎక్స్‌ప్రెస్ తుని రైల్వే స్టేషన్ వద్ద నెమ్మదిగా కదులుతుండగా ఓ ప్రయాణికుడు రైలు ఎక్కే క్రమంలో అదుపుతప్పి బోగీ కింద పట్టాలపై పడిపోయాడు. ప్రమాదాన్ని గమనించిన చంద్రరావు ఏమాత్రం ఆలస్యం చేయకుండా బోగీ కిందకు వెళ్లి పట్టాల మధ్య చిక్కుకున్న ప్రయాణికుడిని బయటకు తీసి ప్రాణాలు కాపాడారు. అనంతరం చికిత్స కోసం ఆసుపత్రికి తరలించేలా చర్యలు చేపట్టారు. హెడ్ కానిస్టేబుల్ చంద్రరావు సాహసాన్ని ఎలమంచిలి రూరల్ ఎస్‌ఐ ఉపేందర్ అభినందించారు. ఈ సాహసోపేత సేవలను జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఐపీఎస్ గుర్తించి నగదు రివార్డు, ప్రశంసా పత్రం అందజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.