రెల్లి రెవిన్యూ లో భూ వివాదం
విజయనగరం జిల్లా బ్యూరో/ రమణ, జూలై 12. పున్నమి ప్రతినిధి.
కొత్తవలస మండలం రెల్లి రెవెన్యూ పరిధిలో అప్పన్న దోరపాలెం గ్రామంలో రెండు ఎకరాల భూ వివాదం చివరకు కొట్లాటకు దారి చేసింది ఈ భూమి మాది అంటే మాదని ఇరు వర్గాల మధ్య గొడవలు జరిగాయి ఈ విషయమై కొత్తవలస పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. గతంలో ఈ భూమిని మాజీ ఎంపీటీసీ గోపిశెట్టి శ్రీనివాసరావు కొనుగోలు చేశానని ఈ భూమికి సంబంధించిన రికార్డులన్నీ నా దగ్గర ఉన్నాయని శుక్రవారం రోజు నా తోటలో ఉన్న నీలగిరి చెట్లను తొలగించడానికి వెళ్తే స్థానికులు కొందరు నన్ను అడ్డుకున్నారని, నన్ను దుర్భాషలాడార ని, గాయపరచారని మాజీ ఎంపీటీసీ గోపిశెట్టి శ్రీనివాసరావు పున్నమి ప్రతినిధికి మీడియా పరంగా తెలియజేశారు

