రాపూరు: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమం జూన్ 15 నుంచి జూలై 14 వరకు కొనసాగుతుందని రాపూరు మండల తహసీల్దార్ పి.ఎల్. నరసింహం ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో 122-వెంకటగిరి నియోజకవర్గ పరిధిలోని రాపూరు మండలంలోని 51 పోలింగ్ కేంద్రాల్లో బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌వోలు) ప్రతి ఓటరు ఇంటికి వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాలను పంపిణీ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.ఓటరు బీఎల్‌వోల సహకారంతో ఎన్యుమరేషన్ ఫారాలను పూర్తిగా నింపి, ఒక పాస్‌పోర్ట్ సైజు ఫోటోతో పాటు ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతిని జతచేసి సంబంధిత బీఎల్‌వోలకు తిరిగి అందజేయాలని సూచించారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మండల ప్రజలందరూ బూత్ స్థాయి అధికారులకు పూర్తి సహకారం అందించి, నిర్దిష్ట గడువులోగా సమయాన్ని పూర్తిగా చేయాలని తహసీల్దార్ పి.ఎల్. నరసింహం గారు విజ్ఞప్తి చేశారు.

రాపూరులో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ తహసీల్దార్ నరసింహం.