సిద్ధవటం మండలం ఉప్పరపల్లె గ్రామానికి చెందిన కీర్తిశేషులు నూకల రాధాకృష్ణయ్య సంవత్సరీక కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులు, బంధువులు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య హాజరై రాధాకృష్ణయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా రాటాల రామయ్య మాట్లాడుతూ రాధాకృష్ణయ్యతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన ఆత్మీయత, మంచితనం, గ్రామ ప్రజలతో కలిసిమెలిసి ఉండే విధానం ఎప్పటికీ గుర్తుండిపోతాయని పేర్కొన్నారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలిచిన వ్యక్తిని కోల్పోవడం బాధాకరమని, ఆయన జ్ఞాపకాలు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల మధ్య చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు.అనంతరం రాధాకృష్ణయ్య కుటుంబ సభ్యులను రాటాల రామయ్య పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కీర్తిశేషులు రాధాకృష్ణయ్య ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో ఏపీ పద్మశాలి సంక్షేమ సంగం యువజన విభాగం కార్యదర్శి అవ్వారు రవిశంకర్,సామల చంగయ్య, శ్రీరామదాసు రవిశంకర్, తదితరులు పాల్గొన్నారు.


