ప్రదేశం:ఉమ్మడి మంగళవారిపేట
*యాప్ లో వద్దు – షాపుల్లోనే యూరియా అమ్మాలి: BRS ఆధ్వర్యంలో ఉమ్మడి మంగళవారిపేటలో భారీ రాస్తారోకో, ధర్నా*
*ముఖ్య అతిథులు:*
1. *వి. ప్రకాష్ రావు* (మాజీ ఎంపీపీ)
2. *బి. శ్రీనివాస్ గౌడ్* (మాజీ AMC చైర్మన్, నర్సంపేట)
3. *ఎమ్. వెంకటనర్సయ్య* (BRS మండల పార్టీ అధ్యక్షుడు)
* కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసమర్థపు విధానాల వలన రైతులు హరిగోసపడుతున్నారు
* ఎలినినో ప్రభావంతో వర్షాలు సరిగా లేక, కరెంటు లేక, నీళ్లు లేక, యూరియా అంధక రైతులూ ఆందోళన చేస్తున్న ఈ కాంగ్రెస్ కూ రైతుల పట్ల కనీసం ప్రేమ లేదు..
కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోవాలని రైతులు గోస తగిలి నాశనం అవుతావు అంటూ ఆందోళనలో రైతాంగం తీవ్ర ఆగ్రహం!*
*RoFR పట్టా కలిగిన గిరిజనులు (STs), నాన్-ట్రైబల్ రైతులందరికీ వెంటనే యూరియా పంపిణీ చేయాలని డిమాండ్*
*ఉమ్మడి మంగళవారిపేట:*
వ్యవసాయ సీజన్ ఉధృతంగా ఉన్న సమయంలో రైతులకు సరిపడా ఎరువులు, యూరియా అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని నిరసిస్తూ
*BRS (భారత రాష్ట్ర సమితి)* ఆధ్వర్యంలో ఉమ్మడి మంగళవారిపేట ప్రధాన రహదారిపై *భారీ రాస్తారోకో మరియు ధర్నానిర్వహించారు. నర్సంపేట, ఖానాపూర్ మరియు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున రైతులు, BRS ప్రజాప్రతినిధులు, నాయకులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు.
*ప్రధాన అంశాలు & నిరసన వివరాలు:*
1. *నర్సంపేట MLA పై మండిపడ్డ రైతులు:*
ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మరియు ఆందోళనలో పాల్గొన్న రైతులు మాట్లాడుతూ.. *నర్సంపేట MLA నీచపు, నికృష్టపు చేతల వల్ల ఈరోజు రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చింది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన రైతాంగాన్ని ఎరువుల కోసం అల్లాడిస్తున్న ఈ ప్రభుత్వానికి, MLA కి రైతుల గోస తగిలి నాశనమైపోతారు”* అని తీవ్ర స్థాయిలో శపించి, ఆక్రోశం వెళ్లగక్కారు.
2. *యాప్ విధానం స్వస్తి – షాపుల్లోనే నేరుగా పంపిణీ చేయాలి:*
యాప్ లో నమోదు చేయాలనే నిబంధనల పేరుతో అధికారుల చుట్టూ, షాపుల చుట్టూ తిప్పుకుంటూ సాంకేతిక సమస్యల సాకుతో సాధారణ రైతులకు యూరియా దొరక్కుండా చేస్తున్నారని మండిపడ్డారు. ఈ యాప్ విధానాన్ని తక్షణమే పక్కనబెట్టి, అన్ని సొసైటీలు మరియు ఫెర్టిలైజర్ షాపుల్లో నేరుగా యూరియాను అందుబాటులో ఉంచి అమ్మకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
3. *ST మరియు Non-Tribal రైతులందరికీ పంపిణీ చేయాలి:*
అటవీ హక్కుల చట్టం (RoFR) కింద పట్టాలు పొందిన గిరిజన (ST) రైతులతో పాటు, గిరిజనేతర (Non-Tribal) రైతులందరికీ ఎలాంటి మినహాయింపులు, వ్యత్యాసాలు లేకుండా తక్షణమే యూరియాను అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న BRS నాయకులు, ప్రజాప్రతినిధులు
బాదావత్ బాలకిషన్
గూగులోత్ బాలు గొంది నాగేశ్వర్ రావు
కాసవిమల లింగమూర్తి
భూక్యా వెంకన్న
బాణోతు వీరన్న ,
బాణోతు శ్రీనివాస్ నాయక్
లావుడ్య రమేష్,
భూక్యా రాములు
కోరి సుధాకర్, బందారపు శ్రీనివాస్ గౌడ్,పులిగిల్ల యాదగిరి,బండి రాములు
బుషాబోయిన రాజు,కోడెగుల రాజు
ఆబోతు అశోక్,బోల్లు మురళి,సతీష్ ,వెంకటేష్, రామూర్తి,రమేష్ ,కిషన్ రాజు,కేశవులు
మరియు ఇతర స్థానిక ప్రజాప్రతినిధులు, BRS నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొని ధర్నాను జయప్రదం చేశారు.



