యలమంచిలి, సెప్టెంబర్ 17 (పున్నమి ప్రతినిధి ఆనంద్ ):
యలమంచిలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ విస్తృతస్థాయి సమావేశం గురువారం జరిగింది. జిల్లా అధ్యక్షుడు బొడ్డుపల్లి శ్రీనివాస్, టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొడ్డి రవి, నియోజకవర్గ ఇన్చార్జి తనకాల అనంతరావు, రావి, ఎం.వి. రాహుల్, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికలపై కీలక చర్చలు జరిగాయి. చైర్మన్ అభ్యర్థిగా దొడ్డి రవిని ఎంపిక చేసినట్లు నాయకులు తెలిపారు. సమీకరణాల అనంతరం తుది నిర్ణయం వెలువడనుంది. 32 వార్డుల్లో అభ్యర్థులను బరిలోకి దింపేందుకు కాంగ్రెస్ సిద్ధమని ప్రకటించారు. పలువురు కొత్త కార్యకర్తలు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ఎన్నికలకు సమర శంఖం పూరించారు.


