సీతారామపురం మండలం బాలాయపల్లి గ్రామంలో ముత్తంశెట్టి చెన్నకేశవులు – ఆదినారాయణమ్మ దంపతుల కుమారుడు రవిచంద్ర, కేశవ ప్రియాంకల వివాహ రిసెప్షన్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్, ఆయన కుమారుడు కాకర్ల సంహిత్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఎమ్మెల్యే అక్షింతలు వేసి శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి దాంపత్య జీవితం ఆనందం, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో నిండిపోవాలని ఆకాంక్షించారు. కుటుంబ బంధాలు ప్రేమాభిమానాలతో చిరస్థాయిగా కొనసాగాలని ఆశీర్వదించారు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులు, బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ముత్తంశెట్టి వారి వివాహ రిసెప్షన్లో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్