Friday, 10 July 2026
  • Home  
  • ఎన్నికల్లో ఓడినా, గెలిచినా నేను ప్రజలకు మంచి చేయడం లక్ష్యంగా ముందుకెళ్లా
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఎన్నికల్లో ఓడినా, గెలిచినా నేను ప్రజలకు మంచి చేయడం లక్ష్యంగా ముందుకెళ్లా

*టీడీపీలోకి వైసీపీ కీలక నేత* *పొదలకూరు మండలం బిరదవోలు పంచాయతీలోని 100 కుటుంబాలతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరిన అక్కెం బుజ్జిరెడ్డి…సంఘీభావం తెలిపిన మరో 250 కుటుంబాలు* *నెల్లూరు వేదాయపాళెం కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో బుజ్జిరెడ్డితో పాటు ఆయన అనుచరులకు ఆత్మీయ ఆహ్వానం పలికిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి* *టీడీపీలో చేరిన వారిలో అక్కెం రాకేష్ రెడ్డి, చేవూరు వెంకట కష్ణయ్య, గండవరపు పెంచలయ్య, కైతేపల్లి మస్తానయ్య, బడుగు కృష్ణయ్య, శేషం అంకయ్య, కైతేపల్లి మీరయ్య, రావుల అంకయ్య, గుమ్మళ్ల పెంచలయ్య తదితరులు* *సోమిరెడ్డి కామెంట్స్* 2019కి ముందు టీడీపీలో కీలకంగా ఉన్న బుజ్జిరెడ్డి వైసీపీలో చేరారు…తిరిగి సొంత గూటికి చేరుకోవడం సంతోషం 2014కి ముందు పొదలకూరు మండల పరిస్థితి చాలా దారుణం…దశాబ్ధాల తరబడి సమస్యలు పేరుకుపోయాయి రాజకీయంగా ఈ ప్రాంతాన్ని ఉపయోగించుకున్నారు కానీ…అభివృద్ధిని పూర్తిగా విస్మరించారు నేను ఎమ్మెల్సీ అయ్యాక కండలేరు ఎడమ కాలువకు ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేయించాను. ఈ రోజు కండలేరులో నీటిమట్టం 30 అడుగులకు చేరినా లిఫ్ట్ ద్వారా సాగునీరు అందించగలుగుతున్నాం..రాజకీయాలకు అతీతంగా రైతులందరూ తోటలు కాపాడుకుంటున్నారు దక్షిణ కాలువపై సైఫన్ నిర్మించి సోమశిల జలాలను పొదలకూరు మండలానికి తీసుకొచ్చాం సోమశిల దక్షిణ కాలువ పెండింగ్ పనులను పూర్తి చేసి మిగిలిన మూడు గ్రామాలకు కూడా నీరు అందించడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాం నిమ్మకాయల మార్కెట్ లో రోడ్లు నిర్మించి వసతులు కల్పించడంతో పాటు కొత్త కొట్లు కట్టించాం 2019కి ముందే సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని అన్ని వసతులతో నిర్మించగా, ఇప్పుడు అధికారంలోకి రాగానే డయాలసిస్ యూనిట్ ఏర్పాటు చేయించాం… ఏడు మండలాల ప్రజలు వినియోగించుకుంటున్న డయాలసిస్ సెంటర్ కోసం ప్రత్యేక భవనం నిర్మించే ప్రయత్నంలో ఉన్నాం 30 పంచాయతీల ప్రజలకు మినరల్ వాటర్ అందించేందుకు చిట్టేపల్లి తిప్పపై ఏర్పాటు చేయించాను..వైసీపీ అధికారంలోకి రాగానే ఆ ప్లాంటును మూతేసి శిథిలావస్థకు చేర్చారు అదానీ కృష్ణపట్నం పోర్టు సహకారంతో మినరల్ వాటర్ ప్లాంటును పునరుద్ధరించే ప్రయత్నంలో ఉన్నాం పేదల ఆకలి తీర్చేందుకు గతంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ ను కూడా మూసేశారు..ఇటీవల ముత్తుకూరులో పున:ప్రారంభించాం..పొదలకూరులోనూ పునరుద్ధరించేందుకు కృషి చేస్తాను కాకాణి రమణారెడ్డి పేరుతో ఏర్పాటు చేసిన స్టేడియంను కూడా అభివృద్ధి చేయబోతున్నాం ప్రతి ఎన్నికల్లో కాకాణికే మెజార్టీ ఇస్తున్న పొదలకూరు మండల ప్రజలు అభివృద్ధి ఎవరి హయాంలో జరిగిందో ఆలోచించుకోవాలి ఒకసారి జెడ్పీ చైర్మన్, రెండు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా ఆయన ఏం చేశాడు… ప్రజలకు మంచి చేయకపోయినా అరాచకాలు, కక్షసాధింపులకు మాత్రం కొదవలేదు…పేదల పొలాల రికార్డులు మార్చేశారు..ప్రభుత్వ భూములను బినామీ పేర్లతో ఎక్కించుకున్నారు ఎన్నికల్లో ఓడినా, గెలిచినా నేను ప్రజలకు మంచి చేయడం లక్ష్యంగా ముందుకెళ్లా త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో అయినా పొదలకూరు మండల ప్రజలు అభివృద్ధికి అండగా నిలవాలని కోరుతున్నా.

*టీడీపీలోకి వైసీపీ కీలక నేత*

*పొదలకూరు మండలం బిరదవోలు పంచాయతీలోని 100 కుటుంబాలతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరిన అక్కెం బుజ్జిరెడ్డి…సంఘీభావం తెలిపిన మరో 250 కుటుంబాలు*

*నెల్లూరు వేదాయపాళెం కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో బుజ్జిరెడ్డితో పాటు ఆయన అనుచరులకు ఆత్మీయ ఆహ్వానం పలికిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*

*టీడీపీలో చేరిన వారిలో అక్కెం రాకేష్ రెడ్డి, చేవూరు వెంకట కష్ణయ్య, గండవరపు పెంచలయ్య, కైతేపల్లి మస్తానయ్య, బడుగు కృష్ణయ్య, శేషం అంకయ్య, కైతేపల్లి మీరయ్య, రావుల అంకయ్య, గుమ్మళ్ల పెంచలయ్య తదితరులు*

*సోమిరెడ్డి కామెంట్స్*

2019కి ముందు టీడీపీలో కీలకంగా ఉన్న బుజ్జిరెడ్డి వైసీపీలో చేరారు…తిరిగి సొంత గూటికి చేరుకోవడం సంతోషం

2014కి ముందు పొదలకూరు మండల పరిస్థితి చాలా దారుణం…దశాబ్ధాల తరబడి సమస్యలు పేరుకుపోయాయి

రాజకీయంగా ఈ ప్రాంతాన్ని ఉపయోగించుకున్నారు కానీ…అభివృద్ధిని పూర్తిగా విస్మరించారు

నేను ఎమ్మెల్సీ అయ్యాక కండలేరు ఎడమ కాలువకు ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేయించాను.

ఈ రోజు కండలేరులో నీటిమట్టం 30 అడుగులకు చేరినా లిఫ్ట్ ద్వారా సాగునీరు అందించగలుగుతున్నాం..రాజకీయాలకు అతీతంగా రైతులందరూ తోటలు కాపాడుకుంటున్నారు

దక్షిణ కాలువపై సైఫన్ నిర్మించి సోమశిల జలాలను పొదలకూరు మండలానికి తీసుకొచ్చాం

సోమశిల దక్షిణ కాలువ పెండింగ్ పనులను పూర్తి చేసి మిగిలిన మూడు గ్రామాలకు కూడా నీరు అందించడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాం

నిమ్మకాయల మార్కెట్ లో రోడ్లు నిర్మించి వసతులు కల్పించడంతో పాటు కొత్త కొట్లు కట్టించాం

2019కి ముందే సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని అన్ని వసతులతో నిర్మించగా, ఇప్పుడు అధికారంలోకి రాగానే డయాలసిస్ యూనిట్ ఏర్పాటు చేయించాం…

ఏడు మండలాల ప్రజలు వినియోగించుకుంటున్న డయాలసిస్ సెంటర్ కోసం ప్రత్యేక భవనం నిర్మించే ప్రయత్నంలో ఉన్నాం

30 పంచాయతీల ప్రజలకు మినరల్ వాటర్ అందించేందుకు చిట్టేపల్లి తిప్పపై ఏర్పాటు చేయించాను..వైసీపీ అధికారంలోకి రాగానే ఆ ప్లాంటును మూతేసి శిథిలావస్థకు చేర్చారు

అదానీ కృష్ణపట్నం పోర్టు సహకారంతో మినరల్ వాటర్ ప్లాంటును పునరుద్ధరించే ప్రయత్నంలో ఉన్నాం

పేదల ఆకలి తీర్చేందుకు గతంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ ను కూడా మూసేశారు..ఇటీవల ముత్తుకూరులో పున:ప్రారంభించాం..పొదలకూరులోనూ పునరుద్ధరించేందుకు కృషి చేస్తాను

కాకాణి రమణారెడ్డి పేరుతో ఏర్పాటు చేసిన స్టేడియంను కూడా అభివృద్ధి చేయబోతున్నాం

ప్రతి ఎన్నికల్లో కాకాణికే మెజార్టీ ఇస్తున్న పొదలకూరు మండల ప్రజలు అభివృద్ధి ఎవరి హయాంలో జరిగిందో ఆలోచించుకోవాలి

ఒకసారి జెడ్పీ చైర్మన్, రెండు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా ఆయన ఏం చేశాడు…

ప్రజలకు మంచి చేయకపోయినా అరాచకాలు, కక్షసాధింపులకు మాత్రం కొదవలేదు…పేదల పొలాల రికార్డులు మార్చేశారు..ప్రభుత్వ భూములను బినామీ పేర్లతో ఎక్కించుకున్నారు

ఎన్నికల్లో ఓడినా, గెలిచినా నేను ప్రజలకు మంచి చేయడం లక్ష్యంగా ముందుకెళ్లా

త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో అయినా పొదలకూరు మండల ప్రజలు అభివృద్ధికి అండగా నిలవాలని కోరుతున్నా.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.