*రాజాం : టీచర్ పై దాడి.. కేసు నమోదు*
విజయనగరం జిల్లా రాజాం మండలం డోలపేట ZPHSలో శుక్రవారం ఉపాధ్యా యుడు వేణుగోపాల్ పై దాడి జరిగింది. పాఠశాల గేటు ఎదుట అదే పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలి కుమారుడు ప్రార్థన సమయంలో కారు నిలిపివేశాడు. విద్యార్థులకు ఇబ్బంది కలుగుతుందని కారు తీయాలని మరో టీచర్ చెప్పడంతో ఆమెపై దుర్భాషలాడాడు. వేణుగోపాల్ జోక్యం చేసుకోగా ఉపాధ్యా యురాలి భర్త కానిస్టేబుల్, కుమారుడు కలిసి ఆయనపై దాడి చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Uploaded Video:

