Friday, 4 September 2026
  • Home  
  • మినీ జాబ్ మేళాలో ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు నియామక పత్రాలు*
- ఖమ్మం

మినీ జాబ్ మేళాలో ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు నియామక పత్రాలు*

*మినీ జాబ్ మేళాలో ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు నియామక పత్రాలు* *వైరా శాసనసభ్యులు మలోత్ రామదాసు నాయక్ వైరా మున్సిపాలిటీ వైస్ చైర్మన్ కట్ల సంతోష్ చేతుల మీదుగా అందించడం జరిగింది* పున్నమి ప్రతినిధి ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ఆగస్టు 20 వైరా: యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో నిర్వహించిన మినీ జాబ్ మేళాలో ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు వైరా ఎమ్మెల్యే మాలోతు రామదాసు నాయక్ నియామక పత్రాలను అందజేశారు. వైరా లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వివిధ ప్రైవేట్ సంస్థలు పాల్గొని అర్హత కలిగిన అభ్యర్థులను ఎంపిక చేశాయి. జాబ్ మేళా ద్వారా ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఎమ్మెల్యే రామదాసు నాయక్ నియామక పత్రాలను అందించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. స్థానికంగా ఇలాంటి జాబ్ మేళాలను మరిన్ని నిర్వహించి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. జాబ్ మేళా నిర్వహణతో తమకు ఉద్యోగ అవకాశాలు లభించాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు, సంస్థల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు వైరా మున్సిపాలిటీ వైస్ ప్రెసిడెంట్ కట్ల సంతోష్, యువత పాల్గొన్నారు.

*మినీ జాబ్ మేళాలో ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు నియామక పత్రాలు*

*వైరా శాసనసభ్యులు మలోత్ రామదాసు నాయక్ వైరా మున్సిపాలిటీ వైస్ చైర్మన్ కట్ల సంతోష్ చేతుల మీదుగా అందించడం జరిగింది*

పున్నమి ప్రతినిధి ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ఆగస్టు 20

వైరా:

యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో నిర్వహించిన మినీ జాబ్ మేళాలో ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు వైరా ఎమ్మెల్యే మాలోతు రామదాసు నాయక్ నియామక పత్రాలను అందజేశారు.

వైరా లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వివిధ ప్రైవేట్ సంస్థలు పాల్గొని అర్హత కలిగిన అభ్యర్థులను ఎంపిక చేశాయి.

జాబ్ మేళా ద్వారా ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఎమ్మెల్యే రామదాసు నాయక్ నియామక పత్రాలను అందించి అభినందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

స్థానికంగా ఇలాంటి జాబ్ మేళాలను మరిన్ని నిర్వహించి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు.

ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.

జాబ్ మేళా నిర్వహణతో తమకు ఉద్యోగ అవకాశాలు లభించాయని పేర్కొన్నారు.

కార్యక్రమంలో సంబంధిత అధికారులు, సంస్థల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు వైరా మున్సిపాలిటీ వైస్ ప్రెసిడెంట్ కట్ల సంతోష్, యువత పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.