భైంసా: ఆగస్టు 22, పున్నమి ప్రతినిధి,
నిర్మల్ జిల్లా బైంసా మండలం మాటేగావ్ నీటికుంటలొ పడి ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు మరణించిన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… కుబీర్ మండలం బెల్గాం (యు.పి.ఎస్) ప్రభుత్వ పాఠశాలలో టీచర్ గా విధులు నిర్వహిస్తున్నటువంటి మచ్చర్ల మహేష్(37) భైంసాలో నివాసం ఉంటారని,శుక్రవారం వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఆప్షనల్ హాలిడే కావడంతో బయటకు అని వెళ్లిన మహేష్ ఎంతకీ తిరిగి రాలేదని తెలిపారు. _ గమనించిన కుటుంబీకులు పోలీసులకు సమాచారం ఇవ్వగా, లొకేషన్ ట్రాక్ చేయడంతో శనివారం మాటేగావ్ నీటి కుంటలొ విగతా జీవిగా పడి ఉండడాన్ని గమనించారు. డెడ్ బాడీని స్థానిక భైంసా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు. మృతునికి భార్య, ఇద్దరు కూతుర్లు ఉన్నారు.

మాటేగాం వాగు కుంటలో పడి ప్రభుత్వ ఉపాధ్యాయడు మృతి
భైంసా: ఆగస్టు 22, పున్నమి ప్రతినిధి, నిర్మల్ జిల్లా బైంసా మండలం మాటేగావ్ నీటికుంటలొ పడి ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు మరణించిన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… కుబీర్ మండలం బెల్గాం (యు.పి.ఎస్) ప్రభుత్వ పాఠశాలలో టీచర్ గా విధులు నిర్వహిస్తున్నటువంటి మచ్చర్ల మహేష్(37) భైంసాలో నివాసం ఉంటారని,శుక్రవారం వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఆప్షనల్ హాలిడే కావడంతో బయటకు అని వెళ్లిన మహేష్ ఎంతకీ తిరిగి రాలేదని తెలిపారు. _ గమనించిన కుటుంబీకులు పోలీసులకు సమాచారం ఇవ్వగా, లొకేషన్ ట్రాక్ చేయడంతో శనివారం మాటేగావ్ నీటి కుంటలొ విగతా జీవిగా పడి ఉండడాన్ని గమనించారు. డెడ్ బాడీని స్థానిక భైంసా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు. మృతునికి భార్య, ఇద్దరు కూతుర్లు ఉన్నారు.

