*మాజీ మంత్రివర్యులు జోగి రమేష్ గారి ప్రెస్ మీట్..*
తప్పుడు ప్రచారం ఖండించిన జోగి రమేష్
మైలవరం ఎన్టీఆర్ జిల్లా పున్నమి న్యూస్.
నేను ఇరిగేషన్ భూములు కబ్జా చేసినట్లు ప్రచారం చేస్తున్నారు.
నా కుటుంబంపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు.
నన్ను,నా కుమారుడు,నా సోదరుడు,అందరిపై అక్రమ కేసులు పెట్టారు
ప్రశ్నించే జోగి రమేష్ గొంతు నొక్కలాని చూస్తారా.
నా కుమారుడు వ్యక్తిగత జీవితంలోకి కూడా రాజకీయాలు తెచ్చారు.
వ్యక్తిగత స్వేచ్ఛను మారుస్తూ మమ్మల్ని వేధిస్తున్నారు.
ఇవేమీ చాలవు అన్నట్లు గుంటూరులో భూములు కబ్జా చేశానని ప్రచారం చేస్తున్నారు.
చిన్నప్పటి నుంచి ,30 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా ఎవరిని మోసం చేయలేదు.
ఇరిగేషన్ భూముల కబ్జా వ్యవహారంలో నాపాత్రపై ఎవరితో అయినా విచారించవచ్చు
నా ప్రాణం ఉన్నంత వరకు నా గొంతు నొక్కలేరు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నన్ను నా కుటుంబాన్ని టార్గెట్ చేసింది.
ఇరిగేషన్ భూముల కబ్జా వ్యవహారంలో నాకు సంబంధం లేదు నా ప్రమేయం లేదు.
మా కుటుంబం మత మార్పిడులు ప్రోత్సహించారని చంద్రబాబు నాయుడు గారు ఆరోపణలు చేస్తున్నారు.
సిఎం చంద్రబాబు స్థాయికి తగిన మాటలేనా..?
భావ్యం కాదు చంద్రబాబు గారు 76 సంవత్సరాల వయస్సు గల వ్యక్తి ఇలా ఎవరైనా మాట్లాడతారా.
నా కుటుంబ వివాదానికి సంబంధించి ఇప్పటికే అన్ని వివరాలు వెల్లడించాను.
మేము ఆలయాలకు వెళ్తాం చర్చిలకు వెళ్తాం.
నా ఇంట్లో చండీ యాగం చేసాము.
దీనిని కూడా రాజకీయ చేయడం సభబా.




