రేషన్ బియ్యం పంపిణీ గడువు పెంచాలి: రమేష్
నిర్మల్: రేషన్ బియ్యం పంపిణీకి ఒక్కరోజే గడువు ఇవ్వడంతో నిరుపేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ నేత. G రమేష్ అన్నారు. కొన్ని రేషన్ దుకాణాల్లో 60 శాతం బియ్యం కూడా పంపిణీ కాలేదని తెలిపారు.
రేషన్ డీలర్లు షాపులు మూసివేసి వివాహ కార్యక్రమాలకు వెళ్లారని ఆయన ఆరోపించారు. రేషన్ బియ్యం పంపిణీ గడువును మరో రెండు వారాలు పొడిగించాలని డిమాండ్ చేశారు. అలాగే విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ బియ్యం అందేలా అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని రమేష్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నయీమ్ మరియు జుబేర్ పాల్గొన్నారు

రేషన్ బియ్యం పంపిణీ గడువు పెంచాలి BRS నేత G. రమేష్
రేషన్ బియ్యం పంపిణీ గడువు పెంచాలి: రమేష్ నిర్మల్: రేషన్ బియ్యం పంపిణీకి ఒక్కరోజే గడువు ఇవ్వడంతో నిరుపేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ నేత. G రమేష్ అన్నారు. కొన్ని రేషన్ దుకాణాల్లో 60 శాతం బియ్యం కూడా పంపిణీ కాలేదని తెలిపారు. రేషన్ డీలర్లు షాపులు మూసివేసి వివాహ కార్యక్రమాలకు వెళ్లారని ఆయన ఆరోపించారు. రేషన్ బియ్యం పంపిణీ గడువును మరో రెండు వారాలు పొడిగించాలని డిమాండ్ చేశారు. అలాగే విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ బియ్యం అందేలా అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని రమేష్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నయీమ్ మరియు జుబేర్ పాల్గొన్నారు

