Monday, 31 August 2026
  • Home  
  • ఓయమ్మ నీ కుమారుడు…
- విశాఖపట్నం

ఓయమ్మ నీ కుమారుడు…

క. ఉట్టి పయినున్న వెన్నల గుట్టగ తాగొంచు బోయి గోప్యముగ తినన్ బట్టున్ దొరకడె మా బ్రతు కెట్టా కడ వెళ్ళునమ్మ ఇట్టాగయినన్!! క.ముద్దిమ్మని బలిమిని మా ముద్దియ చేనున్న వెన్నముద్దలు గొనె నీ ముద్దుల బాలుడు నీకిది ముద్దయినన్ కొమ్మ మాకు ముద్దటవమ్మా? క. కమ్మని వెన్నను గూరిచి అమ్మ యశోదకు తెలుపగ “అమ్మా! నను న మ్మమ్మా నే తినలేదని” ముమ్మని కూర్చుండి బుంగ మూతిని బెట్టెన్!! – శశి శర్మ బొల్లాప్రగడ, శతావధాని.

క.
ఉట్టి పయినున్న వెన్నల
గుట్టగ తాగొంచు బోయి గోప్యముగ తినన్
బట్టున్ దొరకడె మా బ్రతు
కెట్టా కడ వెళ్ళునమ్మ ఇట్టాగయినన్!!

క.ముద్దిమ్మని బలిమిని మా
ముద్దియ చేనున్న వెన్నముద్దలు గొనె నీ
ముద్దుల బాలుడు నీకిది
ముద్దయినన్ కొమ్మ మాకు ముద్దటవమ్మా?

క.
కమ్మని వెన్నను గూరిచి
అమ్మ యశోదకు తెలుపగ “అమ్మా! నను న
మ్మమ్మా నే తినలేదని”
ముమ్మని కూర్చుండి బుంగ మూతిని బెట్టెన్!!

– శశి శర్మ బొల్లాప్రగడ, శతావధాని.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.