*గ్రామీణ స్వయం సహాయక మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పూజ రాఖీ హోల్‌సేల్ దుకాణాన్ని నందిపేట్ మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులు, నందిపేట్ సర్పంచ్ ఎర్రం లింగం ప్రారంభించారు.*
*ఈ సందర్భంగా ఎర్రం లింగం మాట్లాడుతూ, మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగుతూ స్వయం సాధికారత సాధించడం నిజమైన స్త్రీశక్తికి నిదర్శనం అని అన్నారు. మహిళా సంఘాలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు.*
*మహిళా సంఘాల సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి వ్యాపారం విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు.*
*స్త్రీశక్తి – స్వయం సమృద్ధి – సాధికారత ✊*



