భూ భారతి, సాదా బైనామా, బల్క్ ల్యాండ్ సర్వే వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు.
శుక్రవారం చిట్యాల తహసీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బల్క్ భూముల సర్వే, భూ భారతి, సాదా బైనామా, సర్ ప్రక్రియకు నోటీసులు జారీ తదితర అంశాలపై తహసీల్దార్ ను అడిగి తెలుసుకున్నారు.
సాదా బైనామాలో 2325, భూ భారతి 93 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. సర్ ప్రక్రియలో భాగంగా మ్యాపింగ్ కానీ ఓటర్లు, అనామలిస్ ఓటరులకు నోటీసులు జారీ చేయాలని తెలిపారు. జారీ చేసిన నోటీసు, నోటీసు తీసుకున్న వ్యక్తి ఫోటోలు ఎన్నికల సంగం పోర్టల్ అప్ లోడ్ చేయాలని సూచించారు.
బల్క్ ల్యాండ్ సర్వే పూర్తి అయిన సర్వే నంబర్లుపై సమగ్ర నివేదికలు అందచేయాలని స్పష్టం చేశారు.
ఈ తనిఖీలో శిక్షణా డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి, తహసీల్దార్ వసంత రావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


