శబ్ద కాలుష్యానికి కారణమవుతున్న బుల్లెట్ ద్విచక్ర వాహనాలపై ఖమ్మం ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. నిబంధనలకు విరుద్ధంగా అమర్చిన అధిక శబ్దం వచ్చే 400 సైలెన్సర్లను పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో రోడ్డు రోలర్‌తో తొక్కించి ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీ రామానుజం మాట్లాడుతూ వాహనదారులు కంపెనీ నిర్దేశించిన ఒరిజినల్ సైలెన్సర్లనే వినియోగించాలని సూచించారు. అధిక శబ్దంతో వాహనాలు నడిపినా, నిబంధనలకు విరుద్ధంగా సైలెన్సర్లు మార్చినా చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. గతంలో 1,654 బుల్లెట్ సైలెన్సర్లను తొలగించి ధ్వంసం చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు, ఏఆర్ ఏసీపీ సుశీల్ సింగ్, ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, అప్పలనాయుడు పాల్గొన్నారు.



