సంగం: రాష్ట్ర ప్రభుత్వం నూతన పెన్షన్ విధివిధానాలను ఖరారు చేసిందని సంగం మండల టీడీపీ అధ్యక్షులు బాణా శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. నూతన విధానం ప్రకారం అర్హులైన వారు సెప్టెంబర్ 7 నుంచి 16వ తేదీ వరకు పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.అర్హత కలిగిన ప్రజలు తమకు సమీపంలోని గ్రామ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ లేదా వెల్ఫేర్ అసిస్టెంట్ ద్వారా పెన్షన్ దరఖాస్తును నమోదు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు నమోదు చేసిన అనంతరం తప్పనిసరిగా రసీదు పొందాలని తెలిపారు.సంగం మండల పరిధిలోని అన్ని గ్రామ సచివాలయాల సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ, పెన్షన్ కోసం వచ్చే అర్హులకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని కోరారు. దరఖాస్తుదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బాణా శ్రీనివాసులు రెడ్డి కోరారు..

సంగం మండల ప్రజలకు ముఖ్య సమాచారం నూతన పెన్షన్ విధివిధానాలు ఖరారు