ఖమ్మం: భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా మహిళా మోర్చా నూతన కార్యవర్గంలో కాకరవాయి గ్రామ పంచాయతీ 7వ వార్డు సభ్యురాలు శ్రీమతి కొత్తపల్లి వసంతకు జిల్లా మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు అప్పగించారు.
ఈ మేరకు ఖమ్మం జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు మండా సరస్వతి శుక్రవారం నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. నూతన కార్యవర్గంలో ఉపాధ్యక్షురాలిగా కొత్తపల్లి వసంత నియామకం జరిగింది.
గ్రామస్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ, మహిళల సమస్యలపై స్పందిస్తూ ప్రజా సేవలో చురుకుగా పనిచేస్తున్న వసంతకు ఈ బాధ్యతలు అప్పగించడం పట్ల బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. పార్టీ అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ మహిళా మోర్చాను గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేయాలని పార్టీ నాయకులు ఆకాంక్షించారు.
తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతలు అప్పగించిన జిల్లా పార్టీ నాయకత్వానికి, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు మండా సరస్వతికి కొత్తపల్లి వసంత కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తూ మహిళలను పెద్ద సంఖ్యలో బీజేపీ వైపు ఆకర్షించేందుకు, ప్రజా సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఆమె తెలిపారు.
కొత్తపల్లి వసంత నియామకంపై కాకరవాయి గ్రామ ప్రజలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు.



