Wednesday, 23 September 2026
  • Home  
  • బిజ్జంపల్లి పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఎంఈవోలు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

బిజ్జంపల్లి పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఎంఈవోలు

బిజ్జంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఉదయగిరి ఎంఈవోలు టి. వెంకటేశ్వర్లు, టి. శ్రీనివాసులు మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ బోధనను పరిశీలించారు. విద్యార్థులకు పాఠ్యాంశాలు సులభంగా అర్థమయ్యేలా ఐఈపీ ప్యానెళ్ల ద్వారా బోధిస్తున్న ఉపాధ్యాయులు సాయిబాబా, రోషన్ తాజ్‌లను అభినందించారు. అనంతరం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని ఎంఈవోలు స్వయంగా రుచి చూశారు. భోజనం నాణ్యత, రుచి, పరిశుభ్రతపై సంతృప్తి వ్యక్తం చేశారు. పథకం నిర్వహణ తీరును పరిశీలించి, విద్యార్థులకు నాణ్యమైన, పరిశుభ్రమైన భోజనం అందిస్తున్న నిర్వాహకులను ప్రశంసించారు. పాఠశాలలో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని పెంపొందించేలా బోధన కొనసాగించాలని సూచించారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.