Wednesday, 23 September 2026

*టీడీపీలో ఉంటూ ప్రత్యర్థి పార్టీకి మద్దతా? మన్నెపల్లి వేణునాయుడు పై మోహన్ నాయుడు తీవ్ర ఆగ్రహం* *మన్నెపల్లి వేణునాయుడుపై సాక్ష్యాధారాలతో విరుచుకుపడ్డ తుమ్మల మోహన్ నాయుడు* *మన్నెపల్లి వేణునాయుడు చెప్పే సీఎం రిలీఫ్ ఫండ్ దస్త్రాల వెనుక రహస్య అజెండాని బట్టబయలు చేసిన మోహన్ నాయుడు* *————————————————————* ✍️*న్యూస్ విశేషాలు ఎడిటర్ – వినోద్ కుమార్ * *————————————————————* *న్యూస్ విశేషాలు వాకాడు (సెప్టెంబర్ 23)* : వాకాడు మండల రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.తెలుగుదేశం పార్టీలో సీనియర్‌గా చెలామణి అవుతున్న మన్నెపల్లి వేణునాయుడు వ్యవహారశైలిపై స్థానిక కేడర్ తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. పార్టీలో ఒకరిగా ఉంటూ, ప్రత్యర్థి పార్టీలైన వైసీపీకి ఇన్‌ఫార్మర్‌గా, రహస్య ఏజెంట్‌గా మద్దతు ఇస్తున్నారనే ఆరోపణలు మండల రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.కొద్ది రోజుల క్రితం స్థానిక ఇరిగేషన్ గెస్ట్ హౌస్‌లో సమావేశమైన వాకాడు మండల టీడీపీ నాయకులు,వేణునాయుడును పార్టీ నుంచి తక్షణమే సస్పెండ్ చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ పరిణామం జిల్లా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.మండల కమిటీ తీసుకున్న ఈ సస్పెన్షన్ తీర్మానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ మన్నెపల్లి వేణునాయుడు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో వాకాడు మండల టీడీపీ అధ్యక్షులు దువ్వూరు మధుసూదన్ రెడ్డిపై, కొండాపురం మండల పార్టీ ప్రముఖుడు తుమ్మల మోహన్ నాయుడుపై ఆయన తీవ్ర ఆరోపణలు గుప్పించారు. తన రాజకీయ ప్రయాణాన్ని, వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేలా కొండాపురం నాయకులు చేస్తున్న కుట్రలను ప్రజలు గమనించాలని ఆయన కోరారు. ఈ నేపథ్యంలోనే కొండాపురం టీడీపీ సీనియర్ నాయకుడు తుమ్మల మోహన్ నాయుడు తన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించి, వేణునాయుడు వ్యాఖ్యలను తిప్పికొట్టారు.ఈ విలేకరుల సమావేశంలో తుమ్మల మోహన్ నాయుడు మాట్లాడుతూ వేణునాయుడు పార్టీకి చేస్తున్న ద్రోహాన్ని ఎండగట్టారు. పార్టీలో ప్రాథమిక సభ్యత్వం కలిగి ఉంటూనే, ప్రతిపక్ష పార్టీ నేతలకు అనుకూలంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని ఆయన నిలదీశారు.మొనపాలెం ప్రాంతంలో రోడ్డు మార్జిన్‌లో ఉన్న ఒక బిల్డింగ్ తొలగింపు వ్యవహారాన్ని సాకుగా చూపుతూ, తిరుపతిలోని టీడీపీ నాయకురాలైన పనబాక లక్ష్మి వద్దకు వెళ్లి మన్నెపల్లి వేణునాయుడు తప్పుడు ఫిర్యాదులు చేశారని ఆరోపించారు.మండలంలో పార్టీ పరిస్థితి అధ్వానంగా ఉందని, కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన స్వయంగా సృష్టించుకుని పార్టీ అధిష్టానాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.గ్రామ స్థాయి నుంచి హైకోర్టు వరకు లిటిగేషన్లు పెట్టడమే వేణునాయుడు ప్రధాన వృత్తిగా పెట్టుకున్నారని మోహన్ నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.పెద్దలు సంపాదించిపెట్టిన ఆస్తులను కాపాడుకోలేక, ఎన్నికల్లో ఓట్లను అమ్ముకోవడం, గ్రామాల్లో అనవసర వివాదాలను సృష్టించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం మన్నెపల్లి వేణునాయుడు జన్మలోనే ఉందని మోహన్ నాయుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు.మండలంలో పార్టీని నిలబెట్టడానికి ఎంతోమంది నాయకులు చెమటోడ్చి పనిచేస్తుంటే, ఈ కోవర్టు రాజకీయాలు పార్టీకి కోలుకోలేని దెబ్బ తీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.వేణునాయుడు తాను ఎమ్మెల్యే కార్యాలయానికి కేవలం సీఎం రిలీఫ్ ఫండ్ అప్లికేషన్లు తీసుకెళ్లానని చెబుతున్న మాటల్లో పచ్చి అబద్ధాలు ఉన్నాయని మోహన్ నాయుడు సాక్ష్యాధారాలతో నిరూపించారు. మన్నెపల్లి వేణునాయుడు ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ వద్దకు తీసుకెళ్లిన పది దస్త్రాలు పరిశీలిస్తే అసలు నిజాలు బయటపడతాయని తెలిపారు. ఆ ఫైళ్లలో ఉన్న లబ్ధిదారులంతా కేవలం వైసీపీ నాయకులు, ఆ పార్టీ క్రియాశీలక కార్యకర్తలని స్పష్టం చేశారు.కొండూరు రత్నమ్మ, మేరక దయాకర్, చముడుగుంట వెంకటయ్య వంటి ప్రత్యర్థి పార్టీ ఏజెంట్ల పేర్లతో ఉన్న దరఖాస్తులపై వేణునాయుడు తన సొంత ఫోన్ నంబర్లు వేయించుకోవడం దేనికి సంకేతమని ప్రశ్నించారు.ఒకవైపు పార్టీ అధికారంలో ఉంటే, మరోవైపు ప్రతిపక్ష పార్టీ కన్వీనర్లు చెప్పినట్లు నడుచుకుంటూ టీడీపీ శ్రేణులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు.పార్టీ కోసం కష్టపడే నిజమైన కార్యకర్తలను విస్మరించి, ప్రత్యర్థి పార్టీల తొత్తులుగా మారిన వారికి సిఫార్సులు చేయడం క్షమించరాని నేరమని అన్నారు.ఇందుకు సంబంధించిన ఆడియో రికార్డులను, లబ్ధిదారుల ఫోన్ సంభాషణలను మీడియా సమక్షంలో ప్రదర్శించి నిరూపించారు.ఇలాంటి స్పష్టమైన సాక్ష్యాలు ఉన్నప్పటికీ వేణునాయుడు తన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి నీతులు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు.తన రాజకీయ జీవితంపై, కుటుంబ నేపథ్యంపై వేణునాయుడు చేసిన అనుచిత వ్యాఖ్యలను మోహన్ నాయుడు తిప్పికొట్టారు. 1982లో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి తాను పార్టీ కోసం నిబద్ధతతో పనిచేశానని గుర్తుచేశారు. నాటి రోజుల్లో గోడలపై రంగులు వేయడం నుంచి పార్టీ పక్షాన నిలబడి అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నానని తెలిపారు.తన కుటుంబంపై, వ్యక్తిగత నిజాయితీపై ఆరోపణలు చేసే నైతిక హక్కు వేణునాయుడికి లేదని స్పష్టం చేశారు.గ్రామాల్లో చెరువుల ఎన్నికల ప్రక్రియలోనూ వేణునాయుడు తెరవెనుక రాజకీయాలు చేసి వైసీపీ వర్గాలతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. పార్టీ శ్రేణుల మధ్య చిచ్చుపెట్టి లబ్ధి పొందాలని చూసే ఇలాంటి స్వార్థపరుల ఆటలు ఇక సాగవని హెచ్చరించారు. పార్టీ అధిష్టానం జోక్యం చేసుకుని ఇలాంటి కోవర్టుల పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని, తద్వారానే మండలంలో పార్టీ బలోపేతం అవుతుందని మోహన్ నాయుడు స్పష్టం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.