పేదల వైద్యానికి అండగా కూటమి ప్రభుత్వం
మైలవరం నియోజకవర్గంలో ఇప్పటివరకు రూ.27.20 కోట్ల సీఎంఆర్‌ఎఫ్ ఆర్థిక సహాయం.
తాజాగా 227 మందికి రూ.1.08 కోట్ల సీఎంఆర్‌ఎఫ్ రీయింబర్స్‌మెంట్ చెక్కులు అందజేత.
-మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు
ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 23, 2026:
అనారోగ్యంతో బాధపడుతున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు వైద్య ఖర్చుల విషయంలో ఆర్థిక భరోసా కల్పించేందుకు కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్) ద్వారా అండగా నిలుస్తోందని మైలవరం ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వసంత వెంకట కృష్ణప్రసాద్ గారు తెలిపారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు మైలవరం నియోజకవర్గం వ్యాప్తంగా ముఖ్యమంత్రి సహాయనిధి రీయింబర్స్‌మెంట్ చెక్కులు, ఎల్‌ఓసీల రూపంలో మొత్తం రూ.27,20,36,573 ఆర్థిక సహాయం మంజూరైనట్లు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గారు వెల్లడించారు. ఇందులో 2,184 మంది లబ్ధిదారులకు రూ.12,79,26,980 విలువైన సీఎంఆర్‌ఎఫ్ రీయింబర్స్‌మెంట్ చెక్కులు మంజూరు కాగా, 795 మందికి రూ.14,41,09,593 విలువైన ఎల్‌ఓసీలు మంజూరైనట్లు తెలిపారు.
ఇబ్రహీంపట్నంలోని ముత్తవరపు వారి కళ్యాణ మండపంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో తాజాగా మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిధి రీయింబర్స్‌మెంట్ చెక్కులను ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ గారు లబ్ధిదారులకు స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా 227 మంది లబ్ధిదారులకు రూ.1,08,26,169 విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు మంజూరయ్యాయి.
మండలాల వారీగా మంజూరైన సీఎంఆర్‌ఎఫ్ వివరాలు:
– రెడ్డిగూడెం మండలం: 46 మందికి రూ.19,94,306
– మైలవరం మండలం: 74 మందికి రూ.30,99,458
– జి.కొండూరు మండలం: 46 మందికి రూ.20,65,448
– ఇబ్రహీంపట్నం మండలం: 32 మందికి రూ.20,73,327
– విజయవాడ రూరల్ మండలం: 29 మందికి రూ.15,93,630
రాజకీయాలు, పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సహాయం అందేలా కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గారు తెలిపారు. అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు వైద్య చికిత్స ఖర్చుల విషయంలో సీఎంఆర్‌ఎఫ్ ఆర్థిక సహాయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.
కష్టకాలంలో ప్రజలకు అండగా నిలవడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో పేదల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. వైద్య చికిత్స కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు సీఎంఆర్‌ఎఫ్, ఎల్‌ఓసీల ద్వారా నిరంతరం సహాయం అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ గారు లబ్ధిదారులను ఆప్యాయంగా పలకరించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ త్వరగా కోలుకుని ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సందేశ పత్రాలను కూడా సీఎంఆర్‌ఎఫ్ చెక్కులతో పాటు లబ్ధిదారులకు అందజేశారు.
ఆర్థిక సహాయం పొందిన లబ్ధిదారులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి, ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తమ వైద్య చికిత్సకు ఆర్థిక సహాయం అందించి కష్టకాలంలో ప్రభుత్వం అండగా నిలిచిందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ అక్కల రామ్మోహన్రావు (గాంధీ)




