Sunday, 13 September 2026
  • Home  
  • చిట్వేల్‌లో డ్రోన్ నిఘా….. అసాంఘిక కార్యకలాపాలపై పోలీసుల ప్రత్యేక దృష్టి
- తిరుపతి

చిట్వేల్‌లో డ్రోన్ నిఘా….. అసాంఘిక కార్యకలాపాలపై పోలీసుల ప్రత్యేక దృష్టి

చిట్వేల్: మండలంలో అసాంఘిక కార్యకలాపాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసులు డ్రోన్ కెమెరాలతో నిఘా చేపట్టారు. మల్లెంపల్లి, జట్టివారిపల్లి, సీఎంరాచపల్లి గ్రామాలు, వాటి శివారు ప్రాంతాల్లో డ్రోన్‌లను ఎగురవేసి అనుమానాస్పద ప్రదేశాలను పరిశీలించారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు రేణిగుంట డీఎస్పీ వై. శ్రీనివాసరావు పర్యవేక్షణలో కోడూరు రూరల్ సీఐ డి. శ్రీనివాసులు, చిట్వేల్ ఎస్‌ఐ ఎస్. వినోద్‌కుమార్ ఆధ్వర్యంలో ఈ నిఘా నిర్వహించారు. పేకాట, కోళ్ల పందేలు, గంజాయి నిల్వలు, వినియోగం, బహిరంగంగా మద్యం సేవించే ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. డ్రోన్ నిఘాలో అనుమానాస్పద కదలికలు గుర్తిస్తే స్థానిక పోలీసుల ద్వారా వెంటనే స్పందించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. అవసరాన్ని బట్టి మండలంలోని ఇతర గ్రామాల్లోనూ డ్రోన్ నిఘాను విస్తరిస్తామని పేర్కొన్నారు. అసాంఘిక కార్యకలాపాలపై సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేసి సహకరించాలని ప్రజలను కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.